AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Trivikram: SSMB28 సెట్‏లో క్రికెట్ ఆడుతున్న త్రివిక్రమ్.. వైరలవుతున్న వీడియో..

ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట తెగ వైరలయ్యాయి. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఓ ఆసక్తికర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Director Trivikram: SSMB28 సెట్‏లో క్రికెట్ ఆడుతున్న త్రివిక్రమ్.. వైరలవుతున్న వీడియో..
Ssmb28
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2023 | 8:59 AM

Share

అల వైకుంఠపురంలో.. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తో్న్న సినిమా ఎస్ఎస్ఎంబీ 28. సూపర్ స్టార్ మహేష్ బాబు.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతుంది. ఇందులో యువ కథానాయికగా శ్రీలీల కీలకపాత్రలో కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్ గా రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట తెగ వైరలయ్యాయి. తాజాగా SSMB28 మూవీ సెట్స్ నుంచి ఓ ఆసక్తికర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా షూటింగ్ బ్రేక్ టైమ్‏లో సరదాగా ఇతర టీమ్ మెంబర్స్ తో కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా ఈ వీడియోలో మనం రంగస్థలం మహేష్ ను కూడా చూడవచ్చు. మొత్తం అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు. పారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే జక్కన్న ప్రకటించడంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..