AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam: శాకుంతలం నుంచి మరో అందమైన పాట రిలీజ్.. ఆకట్టుకుంటున్న ‘ఏలేలో ఏలేలో ఏలో యాలా’ సాంగ్..

ప్ర‌తి ఫ్రేమ్‌ను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించే గుణ శేఖ‌ర్ మ‌రోసారి ‘శాకుంతలం’ వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

Shaakuntalam: శాకుంతలం నుంచి మరో అందమైన పాట రిలీజ్.. ఆకట్టుకుంటున్న 'ఏలేలో ఏలేలో ఏలో యాలా' సాంగ్..
Shaakunthalam
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2023 | 8:50 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 17న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్ర‌తి ఫ్రేమ్‌ను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించే గుణ శేఖ‌ర్ మ‌రోసారి ‘శాకుంతలం’ వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అందులో భాగంగానే బుధవారం సామ్ నటించిన ఈ మూవీ నుంచి ఏలేలో.. ఏలేలో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

“ఏలేలో ఏలేలో ఏలో యాలా.. ఏటిలోనా సాగే నావా.. ఏలేలో ఏలేలో ఏలో యాలా.. దూరాలేవో చేరే తోవా ” అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. శకుంతల తన భర్తను కలుసుకోవడానికి నావలో బయల్దేరి వెళ్తున్న సందర్భంలో వచ్చే పాట ఇది. సందర్భానికి తగినట్లుగా ట్యూన్ లో మణిశర్మ ఈపాటను చేశారు. చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

‘సీరే కట్టుకొచ్చిందే సందామామా .. సారే పట్టుకొచ్చిందే సందామామా, తుపాను కూడా ఆశల దీపాన్ని ఆర్పలేదు .. కోపాలు శాపాలు కూడా ఏటి కెరటాలను ఆపలేవు వంటి ప్రయోగాలు మనసుకు పట్టుకుంటాయి. బ్లాక్ అండ్ వైట్ వాల్ పెయింట్ మాదిరిగా ఈ పాటను అందించిన తీరు ఆహ్లాదంగా అనిపిస్తోంది. ఈ పాట‌లోని లిరిక్స్ ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్నాయి. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..