కోవై సరళ పేరు చెబితే చాలు.. ఆమె సినిమాల్లో బ్రహ్మనందం కాంబినేషన్‌లో చేసిన ఫన్ గుర్తుకువస్తుంది. అప్పట్లో అంతగా నవ్వులు పంచేది ఆమె. వీరిద్దరి కాంబినేషన్‌కు మస్త్ క్రేజ్ ఉండేది. దర్శకులు వీరి కోసం స్పెషల్ ట్రాక్‌లు రాసుకునేవారు. అయితే చాలాకాలంగా తెలుగు సినిమాల్లో కోవై సరళ కనిపించడం లేదు. తమిళ డబ్బింగ్ సినిమాల్లో తళుక్కుమంటుంది. అలానే ఓ తమిళ మూవీ ‘సెంబి’.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబరు 30న రిలీజైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫిబ్రవరి 3 నుంచి ఈ మూవీ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రభు సాల్మన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Buckle yourself for an emotional thriller tale! #Sembi streaming from February 3 on #Disneyplushotstar@APIfilms @tridentartsoffl @arentertainoffl @prabu_solomon #KovaiSarala @i_amak #ThambiRamaiah @nivaskprasanna @saregamasouth #SembiOnHotstar #SembiFromFeb3 pic.twitter.com/M86Y2LSZnB
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 1, 2023
కథ…
అటవీ ప్రాంతంలో తన మనవరాలితో జీవిస్తూ ఉంటుంది ఓ బామ్మ(కోవై సరళ). ఆమె తేనె అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. ఆమె మనవరాలిపై ఓ పొలిటికల్ లీడర్ కొడుకు, తన ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్ చేస్తాడు. దీంతో ఆ బామ్మ తన మనవరాలికి న్యాయం కోసం పోరాడుతూ వారిపై… పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.