AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. అందమైన సీతాకోక చిలుకల సమంత ఎంత సరదాగా కనిపిస్తుందో చూశారా ?..

తాజాగా సామ్ ప్రముఖ సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన బీటీఎస్ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు డబ్బూ.

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. అందమైన సీతాకోక చిలుకల సమంత ఎంత సరదాగా కనిపిస్తుందో చూశారా ?..
Samantha
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2023 | 9:44 AM

Share

టాలీవుడ్ స్టా్ర్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ సమస్య నుంచి కోలుకుంటుంది. ఆమె నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లనుంది. ఈ సినిమాతోపాటు.. సామ్ నటిస్తోన్న చిత్రం ఖుషి. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ చిత్రానికి బ్రేక్ ఇచ్చిన సామ్ త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొననుంది. ఇదే కాకుండా.. హిందీలో ఆమె నటించనున్న సిటాడెల్ సిరీస్ సైతం స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే సమంత ఈ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా తాజాగా సామ్ ప్రముఖ సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన బీటీఎస్ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు డబ్బూ.

అందులో సామ్.. పసుపు రంగు గౌనులో చూడటానికి ఎంతో అందంగా ముద్ద బంతిలా కనిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా నీరసంగా.. ఎంతో డల్ గా కనిపించిన సామ్.. తాజా ఫోటో షూట్ లో సరదాగా నవ్వులు చిందిస్తూ.. ట్రామ్పోలిన్ పై దూకుతూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. చాలా కాలం తర్వాత సమంతను అంత సంతోషంగా చూసిన అభిమానులు ఖుషి అవుతున్నారు. సామ్ ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది.. సమంత ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సామ్ నటించిన శాకుంతలం సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇటీవల షారుఖ్ నటించిన పఠాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఇప్పుడు ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకు వస్తోన్న భారీ ఆదరణ సమయంలో శాకుంతలం హిందీ వెర్షన్ విడుదల సరికాదని భావిస్తన్నారట నిర్మాతలు. ఈ వార్తలలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us