Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia: భారత్- ఆసీస్‌ మ్యాచ్‌కు ప్రధాని.. ఆస్ట్రేలియా పీఎంతో కలిసి వీక్షించనున్న నరేంద్ర మోడీ

భారత్-ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్టు మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత్‌కు రానున్నారు.ఈ క్రమంలో ప్రధాని మోడీతో మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆసీస్‌ ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియానికి రానున్నట్లు తెలుస్తోంది.

India vs Australia: భారత్- ఆసీస్‌ మ్యాచ్‌కు ప్రధాని.. ఆస్ట్రేలియా పీఎంతో కలిసి వీక్షించనున్న నరేంద్ర మోడీ
Pm Narenda Modi
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2023 | 6:37 PM

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా, రెండో మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. అదేవిధంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం 3వ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథులుగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ హాజరుకానున్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్టు మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత్‌కు రానున్నారు.ఈ క్రమంలో ప్రధాని మోడీతో మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆసీస్‌ ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియానికి రానున్నట్లు తెలుస్తోంది. కాగా అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంను నరేంద్రమోడీ స్టేడియంగా పేరు మార్చిన తర్వాత ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి. ఇటీవలే ఈ స్టేడియంలో భారత్‌- న్యూజీలాండ్‌ జట్ల మధ్య ఆఖరి టీ20 మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

  • ఫిబ్రవరి 9 నుండి 13 వరకు – మొదటి టెస్ట్ (విదర్భ క్రికెట్ స్టేడియం)
  • ఫిబ్రవరి 17 నుండి 21 వరకు – రెండవ టెస్ట్ (అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఢిల్లీ)
  • మార్చి 1 నుండి 5 వరకు – మూడో టెస్టు (ధర్మశాల క్రికెట్ స్టేడియం, హిమాచల్ ప్రదేశ్)
  • మార్చి 9 నుండి 13 వరకు – నాల్గవ టెస్ట్ (నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్)

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..