IND vs AUS: అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్ .. ఏకంగా డూప్‌ను రంగంలోకి దించిన కంగారు టీం
రత గడ్డపై అశ్విన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్త ఎత్తుగడ వేసింది ఆసీస్ టీం మేనేజ్‌మెంట్. నెట్ ప్రాక్టీస్ కోసం నెట్ ప్రాక్టీస్ కోసం అచ్చం ఆశ్విన్‌లా బంతిని తిప్పే భారత స్పిన్నర్‌ను తీసుకుంది.
వచ్చే వారం నుంచి భారత్ , ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టు మ్యాచ్ ల సిరీస్ ప్రారంభంకానుంది. బోర్డర్- గవాస్కర్ ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో జరగనుంది. ఇందుకోసం ఆస్ట్రేలియా బెంగళూరులో సన్నాహాలు ప్రారంభించింది. కాగా భారత గడ్డపై అశ్విన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్త ఎత్తుగడ వేసింది ఆసీస్ టీం మేనేజ్‌మెంట్. నెట్ ప్రాక్టీస్ కోసం నెట్ ప్రాక్టీస్ కోసం అచ్చం ఆశ్విన్‌లా బంతిని తిప్పే భారత స్పిన్నర్‌ను తీసుకుంది. ఇంతకు అతను ఎవరంటే.. మహేష్ పిథియా. 21 ఏళ్ల ఈ స్పి్న్నర్ గతేడాది డిసెంబర్‌లో బరోడా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేశాడు. పితియా బౌలింగ్ యాక్షన్ చూసి అందరూ అతనిని అశ్విన్‌కి డూప్లికేట్ అని పిలుస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా మహేశ్ ఆసీస్ టీం మేనేజ్‌మెంట్ దృష్టిలో పడ్డాడు. వెంటనే అతడిని సంప్రదించారు. నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఆసీస్ బ్యాటర్లు నెట్స్‌లో మహేశ్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ కసరత్తులు చేస్తున్నారు.
కాగా ఆసీస్ స్లార్ ప్లేయర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మహేష్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్‌లు మహేశ్ బంతులను ఎదుర్కొనడానికి ఇక్కట్లు పడ్డారు. కాగా ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉన్నందున ఈ సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెట్టాలంటే ఈ సిరీస్‌లో విజయం సాధించడం భారత జట్టుకు చాలా ముఖ్యం. ఇప్పటికే ఆసీస్ 75.56 పాయింట్లతో ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఇండియా 58.93 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక టీమిండియాకు గట్టిపోటినిస్తోంది.
Imitators, doctored pitches and throwdown specialists … get an exclusive inside look at the lengths Australia are going to in India ?@LouisDBCameron | #INDvAUS
— cricket.com.au (@cricketcomau) February 3, 2023
Mahesh Pithiya grew up being called “Ashwin” owing to his uncanny impersonation of his idol @ashwinravi99 & he ended up ‘playing’ Ashwin for Australia in their first training session on tour & making a big impression on Steve Smith. Here’s how #IndvAus https://t.co/GnAd63DFN6 pic.twitter.com/BgNwOWGDC6
— Bharat Sundaresan (@beastieboy07) February 3, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..