AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BBL 2023: విరాట్ వికెట్‌తో వెలుగులోకి.. 17 సిక్సర్లు.. 45 ఫోర్లు.. 460 పరుగులతో బౌలర్ల ఊచకోత

హోరాహోరీగా జరిగిన బిగ్ బాష్ లీగ్ 2022-23 టైటిల్‌ను పెర్త్ స్కార్చర్స్ గెలుచుకుంది. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా ఈ టోర్నీలోకి బరిలోకి దిగిన పెర్త్ అద్భుత ఆటను కనబరిచి టైటిల్‌ను కాపాడుకుంది.

BBL 2023: విరాట్ వికెట్‌తో వెలుగులోకి.. 17 సిక్సర్లు.. 45 ఫోర్లు.. 460 పరుగులతో బౌలర్ల ఊచకోత
Aaron Hardie
Basha Shek
|

Updated on: Feb 04, 2023 | 9:08 PM

Share

హోరాహోరీగా జరిగిన బిగ్ బాష్ లీగ్ 2022-23 టైటిల్‌ను పెర్త్ స్కార్చర్స్ గెలుచుకుంది. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా ఈ టోర్నీలోకి బరిలోకి దిగిన పెర్త్ అద్భుత ఆటను కనబరిచి టైటిల్‌ను కాపాడుకుంది. ఫైనల్‌లో పెర్త్‌కు 176 పరుగులు అవసరం కాగా 32 బంతుల్లో 53 పరుగులు చేసి కెప్టెన్ ఆష్టన్ టర్నర్ చేసి తన జట్టును గెలిపించాడు. అయితే ఈ టోర్నమెంట్ గెలవడంలో మరో కీలక ప్లేయర్‌ ఉన్నాడు అతనే ఆరోన్ హార్డీ. బ్యాట్‌తోనే కాదు బంతితోనూ అద్భుతాలు చేసిన ఈ యంగ్‌ ప్లేయర్‌ తన జట్టును ఛాంపియన్‌గా నిలిచాడు. కాగా విరాట్ కోహ్లీ కారణంగా ఈ యంగ్‌ క్రికెటర్‌ వెలుగులోకి వచ్చాడు. ఆరోన్ హార్డీ 2018లో ప్రాక్టీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో ఆడాడు. ఆ సమయంలో విరాట్ కెప్టెన్‌గా ఉండగా, టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్‌పై హార్డీ నాలుగు వికెట్లు తీయగా, అందులో విరాట్ కోహ్లీ వికెట్‌ కూడా ఒకటి. అంతే కాదు ఈ మ్యాచ్‌లో హార్డీ అద్భుత హాఫ్ సెంచరీ కూడా చేశాడు.

బిగ్ బాష్ లీగ్‌లో ఆరోన్ హార్డీ అత్యధికంగా 460 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో హార్డీ యావరేజ్‌ 41.81 కాగా స్ట్రైక్ రేట్ కూడా 141గా ఉంది. ఈ టోర్నీలో హార్డీ 17 సిక్సర్లు, 45 ఫోర్లు కొట్టాడు. అలాగే తన మీడియం పేస్ బౌలింగ్‌తో 5 వికెట్లు కూడా తీశాడు. తద్వారా ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన పరంగా మూడో స్థానంలో నిలిచాడు. కెప్టెన్ ఆష్టన్ టర్నర్ 381 పరుగులు చేశాడు. కాగా 2017-18 సంవత్సరంలో ఆడిన అండర్-19 ప్రపంచకప్‌లో హార్డీ ఆస్ట్రేలియన్ జట్టులో ఉన్నాడు. అయితే గాయం కారణంగా అతను టోర్నీ మధ్య నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో ఈ యువ ఆటగాడికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఈ టోర్నీ ఫైనల్‌లో భారత్‌తో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆ భారత జట్టుకు పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరించగా, ఆ టోర్నీలో శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోజూ గిన్నెడు తిన్నారంటే మీ బరువు ఇట్టే తగ్గిపోతారు.. గుగ్గిల్లు
రోజూ గిన్నెడు తిన్నారంటే మీ బరువు ఇట్టే తగ్గిపోతారు.. గుగ్గిల్లు
వాట్సాప్‌లో కొత్త స్కామ్.. తెలుసుకోకపోతే.. నెక్ట్స్ బాధితులు మీరే
వాట్సాప్‌లో కొత్త స్కామ్.. తెలుసుకోకపోతే.. నెక్ట్స్ బాధితులు మీరే
మళ్లీ జంటగా కనిపించిన తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా.. వీడియో ఇదిగో
మళ్లీ జంటగా కనిపించిన తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా.. వీడియో ఇదిగో
కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ VS వ్యక్తిగత బీమా.. ఏది బెస్ట్..?
కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ VS వ్యక్తిగత బీమా.. ఏది బెస్ట్..?
పిల్లల చేతికి తాళాలు ఇస్తున్నారా..? అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం
పిల్లల చేతికి తాళాలు ఇస్తున్నారా..? అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం
వీటిల్లో నిజమైన విగ్రహం ఏదో 5 సెకన్లలో చెప్పుకోండి చూద్దాం..
వీటిల్లో నిజమైన విగ్రహం ఏదో 5 సెకన్లలో చెప్పుకోండి చూద్దాం..
Raja Yoga: గ్రహ రాజు రవి కటాక్షం.. ఆ రాశుల వారికి అధికార యోగాలు..
Raja Yoga: గ్రహ రాజు రవి కటాక్షం.. ఆ రాశుల వారికి అధికార యోగాలు..
కారుణ్య మరణాలపై ఏపీ ప్రభుత్వం సంచలన మార్గదర్శకాలు..
కారుణ్య మరణాలపై ఏపీ ప్రభుత్వం సంచలన మార్గదర్శకాలు..
గతంలో గిల్‌కు జరిగినట్లే ఇప్పుడు తిలక్‌కూ తప్పదా ?
గతంలో గిల్‌కు జరిగినట్లే ఇప్పుడు తిలక్‌కూ తప్పదా ?
5వ అంతస్తు నుంచిపడిన బాలుడికి పునర్జన్మ.. హైదరాబాద్ వైద్యుల సాహసం
5వ అంతస్తు నుంచిపడిన బాలుడికి పునర్జన్మ.. హైదరాబాద్ వైద్యుల సాహసం