Athadu: అతడు సినిమాను పవన్ కళ్యాణ్ కాకుండా ఆ హీరో కూడా మిస్ చేసుకున్నాడట

త్రివిక్రమ్ మాటలు, టేకింగ్, మహేష్ నటన సినిమాకు హైలైట్ సినిమా చాలా సైలెంట్ గా సాగిపోతూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్.. ఆకట్టుకునే ఎలివేషన్స్ తో అతడు సినిమా ఆకట్టుకుంది.

Athadu: అతడు సినిమాను పవన్ కళ్యాణ్ కాకుండా ఆ హీరో కూడా మిస్ చేసుకున్నాడట
Athadu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 07, 2023 | 11:16 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో హిట్స్ గా నిలిచిన సినిమాల్లో అతడు సినిమా ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పటివరకు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే అతడు సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. త్రివిక్రమ్ మాటలు, టేకింగ్, మహేష్ నటన సినిమాకు హైలైట్ సినిమా చాలా సైలెంట్ గా సాగిపోతూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్.. ఆకట్టుకునే ఎలివేషన్స్ తో అతడు సినిమా ఆకట్టుకుంది. అలాగే మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్. ఇక ఈ సినిమా విడుదలైన సమయంలో ప్రేక్షకులు ఈ సినిమాను తక్కువ అంచనా వేశారు.. ఆ తర్వాత ఈ సినిమాకు క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే వదిలిపెట్టకుండా చూస్తుంటారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ సినిమాలో ముందుగా మహేష్ బాబును హీరోగా అనుకోలేదట. అతడు సినిమాను ప్రముఖ నిర్మాత మురళీ మోహన్ నిర్మించారు. అతడు సినిమా సమయంలో మహేష్ కంటే ముందుగా  త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు చెప్పాలి ఆయనను కలిసి కథ చెప్తున్నా సమయంలో ఆయన నిద్రపోయారట ఇదే విషయాన్నీ పలుసార్లు చెప్పారు త్రివిక్రమ్. ఇక పవన్ మిస్ అయిన తర్వాత ఈ సినిమాను మరో హీరోకు అనుకున్నారట.

ఆ హీరో ఎవరోకాదు ఉదయ్ కిరణ్. అప్పట్లో ఉదయ్ కిరణ్ కు లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉంది. మురళి మోహన్ గారు ఈ సినిమా స్టోరీ విన్నాక మొదటగా ఈ సినిమాకి హీరోగా ఉదయ్ కిరణ్ గారిని తీసుకుందాం అనుకున్నారట. అయితే ఆ సమయంలో ఉదయ్ కిరణ్ మెగాఫ్యామిలీతో సంబంధం కలుపుకోనున్నారని టాక్ నడిచింది. ఆసమయంలో అల్లు అరవింద్ ఉదయ్ కిరణ్ డేట్స్ చూసుకునేవారట.. అయితే మురళీమోహన్ అరవింద్ ను కలవగా ఉదయ్ డేట్స్ ఖాళీ లేవని చెప్పారట. దాంతో ఈ సినిమాను మహేష్ బాబుతో చేశారట. ఇదే విషయాన్నీ ఈ మద్యే మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.