AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంకు షాక్ ఇచ్చిన అభిమాని.. అంతమాట అనేశాడేంటీ..!!

ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ కిరణ్ ఫాలోయింగ్ మారిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సెబాస్టియన్ పీసీ 254, సమ్మతమే, నేను మీకు కావాల్సినవాడిని చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయారు.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంకు షాక్ ఇచ్చిన అభిమాని.. అంతమాట అనేశాడేంటీ..!!
Kiran Abbavaram
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2023 | 10:03 AM

Share

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మొదటి చిత్రం రాజావారు రాణిగారు సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన కిరణ్.. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ కిరణ్ ఫాలోయింగ్ మారిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సెబాస్టియన్ పీసీ 254, సమ్మతమే, నేను మీకు కావాల్సినవాడిని చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వినరో భాగ్యము విష్ణు కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాతో మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఫిబ్రవరి 17న శివరాత్రి సందర్భంగా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే కిరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అభిమానుల ప్రశ్నలకు సమాదానాలు ఇస్తూ ఉంటాడు. తాజాగా కిరణ్ ను ఒక అభిమాని షాక్ కు గురి చేశాడు. అన్న నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని ప్రశ్నించాడు. వెంటనే దాని కింద నువ్వు చూసి కూడా రీప్లే ఇవ్వకపోతే ఎప్పటికీ సింగిల్ గానే మిగిలిపోతావ్ అని అన్నాడు. దాంతో షాక్ అయిన కిరణ్ ఏంటి తమ్ముడు అంతమాట అన్నావ్ అంటూ రీప్లే ఇచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..