AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: 90 గంటలుగా శిథిలాల కిందే పది రోజుల శిశువు.. బయటకు తీసి చూడగా అద్భుతం

పెను విషాదం, తీరని శోకాన్ని మిగిల్చిన టర్కీ, సిరియా భూకంపం ఘటనలో హృదయవిదారక దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. శిథిలాల మధ్యే ఓ మహిళ బిడ్డకు ప్రసవించి కన్నుమూస్తే..

Earthquake: 90 గంటలుగా శిథిలాల కిందే పది రోజుల శిశువు.. బయటకు తీసి చూడగా అద్భుతం
Child Alive
Ganesh Mudavath
|

Updated on: Feb 11, 2023 | 4:53 PM

Share

పెను విషాదం, తీరని శోకాన్ని మిగిల్చిన టర్కీ, సిరియా భూకంపం ఘటనలో హృదయవిదారక దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. శిథిలాల మధ్యే ఓ మహిళ బిడ్డకు ప్రసవించి కన్నుమూస్తే.. ఆ చిన్నారిని ఆదుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. సిమెంట్ పిల్లర్ల మధ్య చిక్కుకున్న ఇద్దరు చిన్నారుల్లో తన తమ్ముడికి ఏమీ కాకూడదనే దృఢ సంకల్పంతో ఓ చిన్నారి చేతులు అడ్డు పెట్టుకుని కాపాడిన ఫొటో ప్రపంచమంతా కన్నీరు పెట్టించింది. ప్రస్తుతం కూడా అలాంటి ఘటనే జరిగింది. శిథిలాల మధ్యలో.. గడ్డకట్టే చలిలో.. ఆహారంలేని పరిస్థితుల్లో ఓ పది రోజుల పసికందు ప్రాణాలతో బయటపడడం సంచలనంగా మారింది. 90 గంటల పాటు జీవన్మరణ పోరాటం చేసి గెలిచింది. టర్కీలో సంభవించిన భూప్రళయంలో ఈ శిశువును, అతడి తల్లిని సహాయక సిబ్బంది రక్షించారు.

ఈ చిన్నారి పేరు యాగిజ్‌ ఉలాల్‌. తన తల్లితోపాటు శిథిలాల్లో చిక్కుకున్నాడు. సహాయకచర్యలు చేపడుతున్న సిబ్బందికి సిమెంట్ పెళ్లల మధ్య నుంచి చిన్న శబ్దం వినిపించింది. వెంటనే స్పందించిన సిబ్బంది ఆ బిడ్డను వెలికితీశారు. చిన్నారికి చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తల్లిని కూడా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరికి చికిత్స అందిస్తున్నారు. హతయ్‌ ప్రావిన్సులో భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద వేల సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు గడ్డకట్టే చలిలోనూ నిరంతరం శ్రమిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

సోమవారం తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపం టర్కీ, సిరియాను వణికించింది. మధ్యాహ్నం వచ్చిన మరో భీకర భూకంపానికి ఈ రెండు దేశాలూ మరోసారి చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రకృతి బీభత్సానికి వేలల్లో ప్రాణాలు కోల్పోగా.. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే