Budget CNG Cars: పెట్రో కార్లకు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ కార్లు.. రూ.10 లక్షల్లోపు బెటర్ కార్స్ ఇవే
ప్రస్తుతం ఈవీ కార్ల ట్రెండ్ నడుస్తున్నా చార్జింగ్ స్టేషన్ల కొరత, మానవ వనరుల లోపం కారణంగా ఈవీ వైపు అంతగా దృష్టి పెట్టడం లేదు. కాబట్టి ఈ సమయంలో వారికి సీఎన్‌జీ కార్లు ప్రత్యామ్నాయంగా ఉంటాయని భావిస్తున్నారు.

సొంతిల్లు, ఓ మంచి కారు ఇవే మధ్యతరగతి వాళ్ల చిరకాల స్వప్నాలు. ఎంతో కష్టపడి రూపాయి..రూపాయి పోగేసుకుని ఓ కారు కొనుక్కుందామని అనుకుంటూ ఉంటారు. కారు కొనుక్కున్నా వారిని వేధించేది కారు నిర్వహణ. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా కారు నిర్వహణ వారికి తలకు మించి భారంగా ఉంటుంది. అందువల్ల పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా వేరే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈవీ కార్ల ట్రెండ్ నడుస్తున్నా చార్జింగ్ స్టేషన్ల కొరత, మానవ వనరుల లోపం కారణంగా ఈవీ వైపు అంతగా దృష్టి పెట్టడం లేదు. కాబట్టి ఈ సమయంలో వారికి సీఎన్‌జీ కార్లు ప్రత్యామ్నాయంగా ఉంటాయని భావిస్తున్నారు. కాబట్టి వారి అభిరుచికి అనుగుణంగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే సీఎన్‌జీ కార్ల గురించి తెలుసుకుందాం. రూ.10 లక్షల లోపు ఉండే సీఎన్‌జీ కార్లపై ఓ లుక్కేద్దాం.
మారుతీ సుజుకీ సిఫ్ట్
ఈ కార్ రూ.7.8 లక్షలకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. సీఎన్‌జీ ఆధారిత మార్కెట్‌ను చాలా ఎక్కువ ఈ కార్ సొంతం చేసుకుంది. ఈ కార్ సీఎన్‌జీ వేరియంట్‌లో 1.2 లీటర్, నాలుగు సిలిండర్, డ్యుయల్ జెట్ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే 89 పీఎస్ వద్ద 119 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కిలో సీఎన్‌జీకు 39 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వేరియంట్లలో ఈ కార్ అందుబాటులో ఉంటుంది.
టాటా టియాగో ఐసీఎన్‌జీ
ఈ కార్ నాలుగు వేరియంట్లల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 1.2 లీటర్, మూడు సిలిండర్ రెట్రోవాన్ ఇంజిన్‌తో ఇది వినియోగదారులను పలుకరించనుంది. 86 పీఎస్ వద్ద 113 టార్క్ పవర్‌ను ఈ కార్ విడుదల చేస్తుంది. ఐదు మాన్యువల్ గేర్ బాక్స్‌లతో వచ్చే ఈ కార్ ధర వేరింయట్‌ను బట్టి రూ.6.32 లక్షల నుంచి రూ.7.32 లక్షల మధ్య ఉంటుంది. అలాగే ఈ కార్ 26.49 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది.
హ్యూందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్
సీఎన్‌జీ వెర్షన్లలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఈ కార్‌ను చాలా మంది ఇష్టపడుతున్నారు. 1.2 లీటర్, నాలుగు సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే ఈ కార్ 83 పీఎస్ వద్ద 113 టార్క్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ కార్ మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా వేరియంట్లల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ కార్ వేరియంట్‌ను బట్టి రూ.7.70 లక్షల నుంచి రూ.8.45 లక్షల మధ్య ఉంటుంది.
హ్యూందాయ్ ఆరా సీఎన్‌జీ
భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ సీఎన్‌జీ సెండాన్ కార్ హ్యూందాయ్ ఆరా సీఎన్‌జీ. గ్రాండ్ ఐ 10 నియోస్‌లో ఉన్న ఇంజిన్‌తోనే ఈ కార్‌లో కూడా ఉంటుంది. హ్యూందాయ్ ఆరా రెండు వేరియంట్లల్లో అందుబాటులో ఉంటుంది. ఎస్ వేరియంట్ ధర రూ.6.09 లక్షలుగా ఉంటే, ఎస్ఎక్స్ ధర రూ.8.57 లక్షలుగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం