రాత్రంతా మేల్కోని పగటిపూట నిద్రపోతున్నారా..? మీరు ప్రమాదంలో ఉన్నట్టే..! తస్మాత్ జాగ్రత్త..!!
నిద్ర అలవాట్లు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. టైప్ 2 మధుమేహం ఉన్నవారు సరైన నిద్ర అలవాట్ల వల్ల ప్రమాదంలో పడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు రాత్రి 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే..
ప్రపంచంలో చాలా మంది రాత్రిపూట సినిమాలు, సీరియళ్లు చూస్తూ పగటిపూట నిద్రపోతుంటారు. మీరు కూడా మీరు రాత్రంతా మేల్కొని పగటిపూట నిద్రపోతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు జాగ్రత్త..! ప్రపంచంలో చాలా మంది రాత్రిపూట సినిమాలు, సీరియళ్లు చూస్తూ పగలు నిద్రపోతూ కాలం గడిపేస్తుంటారు. అయితే, రాత్రి పడుకోవడం, పగటిపూట నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక అధ్యయనాల ప్రకారం, రాత్రిపూట మేల్కొనే అలవాటు ఉన్న వ్యక్తులు గుండె జబ్బుల ప్రమాదానికి గురవుతారు. ఎందుకంటే నిద్ర-మేలుకువ అనేది మీ గుండె, రక్త నాళాల పనితీరును నియంత్రిస్తుంది. హెల్త్ టెక్నాలజీ కంపెనీ హుమా ప్రకారం, రాత్రి 11 గంటల తర్వాత పడుకునే వ్యక్తులకు గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 25 శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
టైప్-2 డయాబెటిస్ శాస్త్రవేత్తల ప్రకారం.. త్వరగా నిద్రపోయే వారి కంటే రాత్రిపూట మేల్కొనే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. లేట్ స్లీపర్స్ పగటిపూట ఎక్కువ చురుగ్గా ఉండలేరని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. టైప్ 2 మధుమేహం ఉన్నవారు సరైన నిద్ర అలవాట్ల వల్ల ప్రమాదంలో పడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు రాత్రి 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే గుండెపోటు, స్ట్రోక్‌ల వల్ల చనిపోయే అవకాశం రెండింతలు అధికంగా ఉందని హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం, ఉదయం ఆలస్యంగా మేల్కొవడం వల్ల మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఇది మరింత తీవ్రంగా వేధిస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఆ సమయంలో రాత్రి పొడవుగా ఉంటుంది. పగలు తక్కువగా ఉంటుంది. కానీ, మీరు ఉదయం వరకు నిద్రపోతే, మీరు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.
పొద్దున్నే నిద్ర లేచే స్త్రీలతో పోలిస్తే ఆలస్యంగా పడుకునే స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర అలవాట్లు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి