మీ పిల్లల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. బ్లడ్ క్యాన్సర్ కావచ్చు!

లుకేమియాకు చికిత్స అనేది..భాదితుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఇది పిల్లల వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలు, ఇతర అవయవాల పనితీరు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ థెరపీ,

మీ పిల్లల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి..  బ్లడ్ క్యాన్సర్ కావచ్చు!
Leukemia Symptoms
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 20, 2023 | 8:07 AM

లుకేమియా అనేది ఒక రకమైన క్యాన్సర్. దీనిని ముందుగా గుర్తించి వెంటనే చికిత్స చేయాలి. మన శరీరంలో తెల్లరక్తకణాలు అధికంగా ఉత్పత్తి కావడం వల్ల లుకేమియా వస్తుంది. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో తెల్లరక్తకణాలు అధికంగా ఉత్పత్తి కావడం వల్ల లుకేమియా వస్తుంది. తెల్లరక్తకణాల సంఖ్య ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే అవి ఎర్రరక్తకణాలు, ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి. తగినంత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయకుండా నిరోధించడం ద్వారా అవి మన శరీరాన్ని బలహీనపరుస్తాయి. ఇవి బలహీనపడటం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోయి రక్తకణాల్లోనే కాకుండా బోన్ మ్యారోలో కూడా ట్యూమర్లు ఏర్పడతాయి. ఇవి లుకేమియాకు దారితీస్తాయి. దీని వల్ల శరీరంలో శక్తి సామర్థ్యం తగ్గి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుంది. అందుకే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స చేయాలి. అయితే లుకేమియా లక్షణాలు ఎలా ఉంటాయి..? ఎలాంటి చికిత్స ఉంటుంది..ఇక్కడ తెలుసుకుందాం..

లుకేమియా ఎలా నిర్ధారణ అవుతుంది? పిల్లలలో అసాధారణ లక్షణాలు ఎలా ఉంటాయనేది పరిశీలించినట్టయితే.. మొదట్లో సాధారణ జ్వరం, ముక్కు కారడం,దగ్గు ఉంటాయి. కానీ అవి రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి.

పిల్లలకి తరచూ గాయాలు తగిలినా, త్వరగా నయం కాకపోయినా, రక్తస్రావం విపరీతంగా కొనసాగితే, అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్, జ్వరం అనేది పిల్లలు, పెద్దలలో అన్ని రకాల క్యాన్సర్ల సాధారణ లక్షణం. పిల్లలకి నిరంతరం జ్వరం వచ్చి చాలా కాలం వరకు జ్వరం తగ్గకపోతే వెంటనే పరీక్షలు చేయించాలి. తరచుగా లేదా నిరంతర దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లయితే జాగ్రత్త వహించాలి. చిగుళ్ల సమస్యలు, శరీరంలో దద్దుర్లు, వేగంగా బరువు తగ్గడం, శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, తలనొప్పి, విపరీతమైన వాంతులు వంటివి ఉంటే జాగ్రత్తగా ఉండండి.

ఇవి కూడా చదవండి

లుకేమియాకు చికిత్స.. లుకేమియాకు చికిత్స అనేది..భాదితుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఇది పిల్లల వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలు, ఇతర అవయవాల పనితీరు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌లను లుకేమియా చికిత్సకు ఆంకాలజిస్టులు ఉపయోగిస్తారు.

ఆరోగ్య వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి