IND Vs AUS: 10 ఏళ్ల తర్వాత జట్టులోకి రోహిత్ సహచరుడు ఎంట్రీ.. రంజీల్లో ‘మ్యాచ్ విన్నర్’.. ఎవరంటే?

ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన..

IND Vs AUS: 10 ఏళ్ల తర్వాత జట్టులోకి రోహిత్ సహచరుడు ఎంట్రీ.. రంజీల్లో 'మ్యాచ్ విన్నర్'.. ఎవరంటే?
Ind Vs Aus Odi
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 20, 2023 | 5:45 PM

ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన 18 మంది ప్రాబబుల్స్‌లో రంజీ ట్రోఫీ ‘మ్యాచ్ విన్నర్’ జయదేవ్ ఉనద్కత్ పేరు ఉండటం విశేషం. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఈ టీమిండియా పేసర్ భారత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. 2013 నవంబర్ 21న వెస్టిండీస్‌తో కొచ్చిలో తన చివరి వన్డే ఆడిన ఉనద్కత్, ఆ మ్యాచ్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. అయితేనేం.. ఈలోపు దేశవాళీ క్రికెట్‌లో ఉనద్కత్ దుమ్ముదులిపాడు. దీంతో ఆ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు అతడ్ని తిరిగి వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. మరోవైపు ఉనద్కత్ నాయకత్వంలో సౌరాష్ట్ర జట్టు రెండోసారి రంజీ ట్రోఫీని గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఆడిన రంజీ ఫైనల్స్‌లో ఉనద్కత్ మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల విషయానికొస్తే, ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో ఉనద్కత్ 10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అటు ఉనద్కత్ నాయకత్వంలో సౌరాష్ట్ర ఈ సంవత్సరం విజయ్ హజారే ట్రోఫీని కూడా గెలుచుకున్న విషయం విదితమే. కాగా, ఉనద్కత్ ఎంపికతో జట్టులో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌కు ప్లే-11లో అవకాశం వస్తే జట్టు కూర్పులో వైవిధ్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. అటు ఉనద్కత్ ఇప్పటివరకు భారత్ తరఫున ఏడు వన్డేలు ఆడి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.