AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లూడో’ పరిచయంతో భారత యువకుడిని పెళ్లాడిన పాక్ అమ్మాయి.. కానీ చివరకు ఏమయ్యిందంటే..

ములాయం కొన్నేళ్లుగా బెంగళూరులో ఉంటున్న నేపథ్యంలో అక్కడే కాపురం పెట్టాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇఖ్రా తన పేరును హిందూ పేరును..

‘లూడో’ పరిచయంతో భారత యువకుడిని పెళ్లాడిన పాక్ అమ్మాయి.. కానీ చివరకు ఏమయ్యిందంటే..
Pak Girl And Ind Boy
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 20, 2023 | 8:15 PM

Share

ప్రస్తుత కాలంలో దేశాంతర ప్రేమలు.. పెళ్లిళ్లు కొత్తేమీ కాదు. అలాంటి వాటికి కొన్ని కొన్ని సందర్భాలలో పెద్దలు అభ్యంతరం చెప్పినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే పాకిస్థాన్‌కు చెందిన ఒక అమ్మాయి సరిహద్దులు దాటి వచ్చి మరీ భారత యువకుడ్ని పెళ్లాడి.. ఇక్కడే ఉండిపోయే ప్రయత్నం చేయగా, అధికారులు ఆమెను తిప్పిపంపిన వైనం వెల్లడయింది. పాకిస్థాన్‌కు చెందిన ఇఖ్రా జీవానీ వయసు 19 ఏళ్లు. ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడుతుండగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ములాయం సింగ్(26) అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొద్దిరోజుల్లోనే ములాయంతో ఇఖ్రా ప్రేమలో పడింది. అతనిని పెళ్లి చేసుకుందామని సరిహద్దులు దాటి మరీ భారత్‌కు వచ్చింది.

ఈ క్రమంలో ఆమె తనకు వీసా లేకపోవడంతో ములాయం సలహా మేరకు తొలుత నేపాల్ చేరుకుంది. అలా ఖాట్మండులో ములాయం ఆమెను కలుసుకున్నాడు. ఇద్దరూ అక్కడే పెళ్లి చేసుకుని, సరిహద్దుల్లోని సనోలీ ప్రాంతం నుంచి భారత్‌లో ప్రవేశించారు. ములాయం కొన్నేళ్లుగా బెంగళూరులో ఉంటున్న నేపథ్యంలో అక్కడే కాపురం పెట్టాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇఖ్రా తన పేరును హిందూ పేరును తలపించేలా రవా అని మార్చుకుంది.

అయితే ఆమె నమాజ్ చేస్తుండడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. దాంతో వారు కాస్త పోలీసులకు సమాచారం అందించడంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇఖ్రాను అరెస్ట్ చేసి, ఆమె పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. అసలు విషయం తెలియడంతో ఇఖ్రాను పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తరలించారు. అనంతరం అట్టారీ బోర్డర్ నుంచి ఆమెను పాక్‌కు తిప్పి పంపారు.

ఇవి కూడా చదవండి