Viral Video: సూపర్ మ్యాన్‌లా పిల్లాడిని కాపాడావ్.. నువ్వు గ్రేట్‌ బాస్‌! సెకనులో అరభాగం ఆలస్యమైనా..

జీవితమే ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ బుక్‌/మువీ..! ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలూహించలేం. ఇక చావు బ్రతుకుల విషయంలో పైవాడి ప్లాన్లలో ట్విస్టుల సంగతి సరేసరి. అనారోగ్యం, యాక్సిడెంట్‌ వల్లనో ప్రమాదం సంభవించి..

Viral Video: సూపర్ మ్యాన్‌లా పిల్లాడిని కాపాడావ్.. నువ్వు గ్రేట్‌ బాస్‌! సెకనులో అరభాగం ఆలస్యమైనా..
Viral Video
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 20, 2023 | 8:05 PM

జీవితమే ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ బుక్‌/మువీ..! ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలూహించలేం. ఇక చావు బ్రతుకుల విషయంలో పైవాడి ప్లాన్లలో ట్విస్టుల సంగతి సరేసరి. అనారోగ్యం, యాక్సిడెంట్‌ వల్లనో..  ప్రమాదం సంభవించి మృత్యువు కభళిస్తుంది. ఒక్కోసారి పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కుప్పకూలి చనిపోతుంటారు. ఇవన్నీ హఠాత్తుగా జరిగిపోతుంటాయి. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా చావుబతుకుల ఆట ఎప్పటికీ టామ్‌ అండ్‌ జెర్నీల మాదిరిగానే ఉంటుంది. తృటిలో ప్రమాదం తప్పి ప్రాణాల నుంచి బయటపడేవారు కూడా ఉన్నారు. అటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వీధి రోడ్డుపై నలుగురైదుగురు పాదచారులు నడుచుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో ఓ బైక్‌ హఠాత్తుగా వచ్చి రోడ్డు దాటుతోన్న పిల్లాడిని ఢీ కొట్టబోతుంది. ఇంతలో అటుగా వెళ్తున్న పాదచారుల్లో ఒకతను సూపర్ మ్యాన్‌లా మెరుపువేగంతో పిల్లాడిని సింగిల్‌ హ్యాండ్‌తో ఎత్తిపక్కకు లాగేస్తాడు. సడెన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ స్కిడ్‌ అయ్యి దానిపై ప్రయాణిస్తు్న్న ఇద్దరు వ్యక్తులు కూడా రోడ్డుపై పడిపోవడం వీడియో చూడొచ్చు. ఈ ప్రమాదంలో అందరూ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అదే.. సెకనులో ఏ కొంత భాగమైనా ఆలస్యమైతే కళ్లముందు భయంకరమైన సన్నివేశం చూడవల్సి వచ్చేది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు పిల్లాడిని కాపాడిన వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.