AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చాలా పెద్ద ప్లానే ఇది.. మిరపకాయలతో ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడయోను మీరు చూడండి..

మందుబాబులు, ధూమపానం చేసేవారికి సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో మీరు ఈ పాటికి చాలానే చూసి ఉంటారు. అయితే అవన్నీ ఒక ఎత్తు..

Viral Video: చాలా పెద్ద ప్లానే ఇది.. మిరపకాయలతో ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడయోను మీరు చూడండి..
Woman Applying Mirchi Pulp To Cigarettes
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 20, 2023 | 7:09 PM

Share

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలుసు. కానీ చాలా మంది ఆ సూచనలను పెడచెవిన పెడుతుంటారు. అలాంటివారు తమ తల్లిదండ్రులు, భార్య, ఆఖరికి పిల్లలు చెప్పినా కూడా వినరు. ఎంత చెప్పినా వినకపోయేసరికి వారు కూడా చెప్పడం మానేస్తారు. ఇక మందుబాబులు, ధూమపానం చేసేవారికి సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో మీరు ఈ పాటికి చాలానే చూసి ఉంటారు. అయితే అవన్నీ ఒక ఎత్తు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మరో ఎత్తు. అందుకే ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా దీనిని మళ్లీ మళ్లీ చూడకుండా ఉండలేకపోతున్నారు.

అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఒక మహిళ సిగరెట్లకు పండు మిరపకాయల రసం రాస్తోంది. అది కూడా తీరికగా ఒక్కొక్క సిగరెట్ తీసుకుని.. పండు మిరపరసం దానికి అద్దిస్తోంది. అనంతరం తిరిగి వాటిని సిగరెట్ బాక్స్‌లో పెట్టెస్తోంది కూడా. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. బహుశా ఆ సిగరెట్లను తన భర్త వద్ద నుంచి అతనికి తెలియకుండా తీసుకుని ఉంటుంది ఆమె. స్మోకింగ్ వద్దని కూడా ఆమె తన భర్తకు ఎంత చెప్పినా వినకపోయి కూడా ఉండవచ్చు. అందుకే ఆమె ఇలా చేసి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లోని navvandirababu అనే మీమ్స్ ఖాతా నుంచి ‘పెద్ద ప్లానే’ క్యాప్షన్‌తో పోస్ట్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘పాపం ఆమె భర్త’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల 46వేల వీక్షణలు.. 13వేలకు పైగా లైకులు లభించాయి. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘పాపం అక్కా.. షాపు వాళ్లతో గోడవ పెట్టుకుంటాడు’ అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే ‘అర్జంటుగా ఆ ఇంటికి 108 పంపించండి. లేకపోతే అతన్ని ఎక్కడికో తీసుకెళ్లాల్సి ఉంటుంద’ని రాసుకొచ్చారు. ఇలానెటిజన్లు వారి వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం