AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Organ Donation: అవయవ దానంలో మారిన కీలక నిబంధనలు.. వయోపరిమితి అంశంలో కీలక అప్‌డేట్ ఇదే..

సామాజిక కార్యకర్తలు ఎంత అవగాహన కల్పిస్తున్నా అధిక జనాభా ఉన్న భారతదేశం అవయవ దానంలో మాత్రం వెనుకబడే ఉంది. మూఢ నమ్మకాలు ఎలా ఉన్నా కొన్ని కఠిన నిబంధనల వల్ల కూడా భారత్‌లో అవయవాలను సేకరించిడం కష్టంగా మారిందని కొందరి వైద్యుల అభిప్రాయం. ఈ నేేపథ్యంలో భారత ప్రభుత్వం అవయవ దానం విషయంలో కొన్ని నిబంధనలను సవరించింది.

Organ Donation: అవయవ దానంలో మారిన కీలక నిబంధనలు.. వయోపరిమితి అంశంలో కీలక అప్‌డేట్ ఇదే..
Organ Transplanation
Nikhil
|

Updated on: Feb 21, 2023 | 4:47 PM

Share

అవయవ దానం భారత్‌లో ప్రాచూర్యం లేని ఓ అంశం. మనం చనిపోయాక మన శరీరీ అవయవాలను బతికున్న వేరి వారికి అమర్చడానికి వీలుగా మనం బతికి ఉన్నప్పుడే సమ్మతిని తెలియజేయాలి. కొన్ని అనుకోని సందర్భాల్లో అయితే కుటుంబ సభ్యుల అనుమతితో కూడా అవయవాలను సేకరిస్తూ ఉంటారు. భారత్‌లో కొన్ని నమ్మకాలు బాగా ప్రాచూర్యం పొందాయి. అవయవ దానం చేస్తే సద్గతి ప్రాప్తించదని, ఇతర భయాలు బాగా ఉండడంతో అవయవ దానం విషయంలో బాగా వెనకబడి ఉన్నాం. సామాజిక కార్యకర్తలు ఎంత అవగాహన కల్పిస్తున్నా అధిక జనాభా ఉన్న భారతదేశం అవయవ దానంలో మాత్రం వెనుకబడే ఉంది. మూఢ నమ్మకాలు ఎలా ఉన్నా కొన్ని కఠిన నిబంధనల వల్ల కూడా భారత్‌లో అవయవాలను సేకరించిడం కష్టంగా మారిందని కొందరి వైద్యుల అభిప్రాయం. ఈ నేేపథ్యంలో భారత ప్రభుత్వం అవయవ దానం విషయంలో కొన్ని నిబంధనలను సవరించింది. వీటిలో ముఖ్యంగా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ మూడు నిబంధనల విషయంలో తీసుకున్న నిర్ణయం భారత్‌లో అవయవ దానం కేసులు పెరిగే అవకాశం ఉంది. 

మారిన నిబంధనలు ఇవే

  • వయో పరిమితి తొలగింపు
  • రాష్ట్రాలు అనుసరించే నివాస ప్రమాణాల తొలగింపు
  • అవయవ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు

వయోపరిమితి

గతంలో అవయవ దానం చేయలంటే 65 ఏళ్ల లోపు ఉన్న వారు మాత్రమే అవయవ మార్పిడి రిజిస్ట్రర్ చేసుకునేందుకు అర్హులుగా పరిగణించే వారు కానీ ప్రస్తుతం ఆ వయో పరిమితిని కేంద్రం తొలగించింది. 

నివాస ప్రమాణాల తొలగింపు

ప్రస్తుతం ఏదైనా రాష్ట్రానికి చెందిన వ్యక్తులు మరణిస్తే ఆ రాష్ట్రానికి చెందిన వారికే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేవి. కొన్ని రాష్ట్రాలైతే వారి రాష్ట్రంలో నివాసం ఉండే ఇతర రాష్ట్రాల వారికి కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అనుమతినిచ్చేవి. కొన్ని రాష్ట్రాలు సమీప రాష్ట్రాలకు దానం చేసేవి. కొన్ని అరుదైన కేసుల్లోనే అవయాలను జాతీయం చేసేందుకు రాష్ట్రాలు అనుమతినిచ్చేవి. అయితే ప్రస్తుతం ఈ నిబంధనను కేంద్రం తొలగించింది. దీంతో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తికైనా అవసరాన్ని బట్టి అవయవాలను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు

2014 అవయవ, కణజాల మార్పిడి ప్రకారం బాధితుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడానికి నిబంధనలు అనుమతించవు. తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలు రూ.5000-10,000 రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయవద్దని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!