Daughter’s Love: తండ్రి కోసం కూతురు ఆరాటం.. చట్టంతో పోరాటం చేసి.. దేశంలో తొలి మైనర్ డోనార్ గా నిలిచిన బాలిక

ఇటీవల లాలూ ప్రసాద్ ను బతికించుకోవడం కోసం కూతురు అవయవదానం చేసిన సంగతి తెలిసిందే.. కాగా ఇప్పుడు ఓ మైనర్ బాలిక తన తండ్రిని బతికించుకోవడం కోసం ఏకంగా చట్టంతోనే పోరాడింది.. అన్ని అనుమతులు తెచ్చుకుని ఇప్పుడు తండ్రి ప్రాణాలను దక్కించుకోవడం కోసం అవయవదానానికి రెడీ అయింది.

Daughter's Love: తండ్రి కోసం కూతురు ఆరాటం.. చట్టంతో పోరాటం చేసి.. దేశంలో తొలి మైనర్ డోనార్ గా నిలిచిన బాలిక
Kerala Girl Devananda
Follow us

|

Updated on: Dec 25, 2022 | 9:53 AM

సృష్టిలో ఎన్నో బంధాలు, అనుబంధాలున్నాయి.. అయినప్పటికీ తండ్రీకూతురు బంధం వెరీ వెరీ స్పెషల్.. తండ్రిమీద కూతురుకి ఉన్న ప్రేమ పుడమి అంత.. అమ్మకాన్ని అమ్మ తన కూతురుపై తండ్రి ప్రేమ ఆకాశమంత.. ఇప్పటికే తండ్రీకూతురుకి సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. ఇటీవల లాలూ ప్రసాద్ ను బతికించుకోవడం కోసం కూతురు అవయవదానం చేసిన సంగతి తెలిసిందే.. కాగా ఇప్పుడు ఓ మైనర్ బాలిక తన తండ్రిని బతికించుకోవడం కోసం ఏకంగా చట్టంతోనే పోరాడింది.. అన్ని అనుమతులు తెచ్చుకుని ఇప్పుడు తండ్రి ప్రాణాలను దక్కించుకోవడం కోసం అవయవదానానికి రెడీ అయింది. మనసుని కదిలించే ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలిక దేవానందకు అవయవాదానికి కేరళ హైకోర్టు  గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆ బాలిక తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసి అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి ప్రతీష్ (48) ప్రాణాలను కాపాడుకోవచ్చు. 2014లోని రూల్ 18 ప్రకారం ఒక డోనార్ తన అవయవాలు , కణజాలాల మార్పిడి నిబంధనలు ఉన్నాయి. డోనర్ మేజర్ అయి ఉండాలి. అయితే వయస్సులో తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ 17 ఏళ్ల బాలిక  హైకోర్టులో పిటిషన్టి వేసింది. దీనిని విచించిన హైకోర్టు బాలికకు అనుమతించింది. దీంతో తండ్రి ప్రాణాలను కాపాడుకోవడం కోసం దేవానంద చేసిన అలుపెరగని పోరాటం ఎట్టకేలకు విజయం సాధించడం హర్షణీయమని పలువురు అభినందిస్తున్నారు.

అంతేకాదు దేవానంద తన తండ్రి ప్రాణాలను కాపాడేందుకు చేసిన పోరాటాన్ని అభినందిస్తున్నానని..  దేవానంద వంటి పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు ధన్యులు” అని జస్టిస్ వీజీ అరుణ్ డిసెంబర్ 20న తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తన తండ్రి పట్ల అమ్మాయికి ఉన్న ప్రేమని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

దేవానంద తండ్రి ప్రతీష్  క్రానిక్ లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నారు. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. తన తండ్రి ప్రాణాలు తనకు దక్కాలంటే.. ఏకైక మార్గం కాలేయం మార్పిడి అని తెలుసుకుంది. దెబ్బతిన్న కాలేయాన్ని మార్చడానికి ప్రతిష్ కుమార్తె కాలేయం మాత్రమే మ్యాచ్ అయింది. తన తండ్రి ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన అవయవాన్ని దానం చేయడానికి  దేవానంద సిద్ధంగా ఉంది. అయితే ఆమెకు 17 సంవత్సరాల వయస్సు మాత్రమే. దీంతో చట్ట నిబంధనల ప్రకారం, మైనర్ వ్యక్తులు అవయవ దానం చేయడానికి అనుమతి లేదు. దీంతో తన తండ్రి కోసం కోర్టు మెట్లు ఎక్కింది. తనకు అవయవాదానికి అవకాశం ఇవ్వమని కోర్టువారికి విజ్ఞప్తి చేసింది.

తండ్రిపై కూతురుకి ఉన్న ప్రేమకు కోర్టు కూడా స్పందించింది. దేవానంద కేసును అధ్యయనం చేయాలని కేరళ రాష్ట్ర అవయవ కణజాల మార్పిడి సంస్థకు సూచింది. ఆ కె-సాట్టో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ తీర్పునిచ్చింది. దీంతో దేశంలో తొలి మైనర్ అవయవదాతగా రికార్డ్ కెక్కింది దేవానంద. అంతేకాదు ఈ  తీర్పుపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కూడా స్పందించారు. కూతురు నిర్ణయాన్ని ప్రశంసించారు. అవయవదాన ప్రక్రియలో దేవానంద చరిత్రలో భాగమవుతున్నారన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..