IPL 2023: ఐపీఎల్ వద్దంది.. PSL రమ్మన్నది.. కట్ చేస్తే మ్యాచ్‌లో విధ్వంసం సృ‌ష్టించిన రోహిత్ దోస్త్..

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బాబర్ అజామ్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. ఫిబ్రవరి 20న క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో..

IPL 2023: ఐపీఎల్ వద్దంది.. PSL రమ్మన్నది..  కట్ చేస్తే మ్యాచ్‌లో విధ్వంసం సృ‌ష్టించిన రోహిత్ దోస్త్..
Peshawar Zalmi
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 21, 2023 | 5:56 PM

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బాబర్ అజామ్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. ఫిబ్రవరి 20న క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ బాబర్ అజామ్ పెషావర్ జాల్మి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెషావర్ జట్టు ఈ బలమైన విజయాన్ని అందుకోవడానికి ఐపీఎల్‌ మినీ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ కారణమయ్యాడు. అతడ్ని ఐపీఎల్ వద్దంది.. PSL రమ్మన్నది.. కట్ చేస్తే.. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు. మరి అతడెవరో కాదు ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ జేమ్స్ నీషమ్.

పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెట్టా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. దానికి సమాధానంగా పెషావర్ జల్మీ 18.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. తద్వారా 9 బంతులు మిగిలి ఉండగానే పెషావర్ అద్భుత విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో పెషావర్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్(19) విఫలమైనా.. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్(37) జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. లోయర్ ఆర్డర్‌లో వచ్చిన అతడు 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. అలాగే నీషమ్‌కు తోడుగా పావెల్(36) తుఫాన్ బ్యాటింగ్ తోడవ్వడంతో పెషావర్ జట్టుకు విజయం సునాయాసం అయింది. చివర్లో షనక(16), రియాజ్(10) మెరుపులు మెరిపించడంతో 4 వికెట్ల తేడాతో బాబర్ అజామ్ జట్టు టోర్నమెంట్‌లో రెండో విజయం అందుకుంది.

బ్యాట్‌తోనే కాదు బంతితోనూ..

అంతకుముందు, నీషమ్ బంతితోనూ అద్భుతాలు సృష్టించాడు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి.. పొదుపు బౌలింగ్ వేయడమే కాకుండా.. క్వెట్టా గ్లాడియేటర్స్ అతిపెద్ద వికెట్‌ను సైతం పడగొట్టాడు. ఆపై బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. కాగా, జిమ్మీ నీషమ్‌ను IPL 2023 మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు. బేస్ ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన నీషమ్‌కు చివరికి నిరాశే మిగిలింది.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో