IPL 2023: 9 ఫోర్లు, 17 సిక్సర్లతో తుఫాన్ సెంచరీ.. బౌలర్లపై వీరవిహారం చేసిన ధావన్ సహచరుడు.. ఎవరంటే?
మరో నెల రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. అయితే ఈలోపే పంజాబ్ కింగ్స్‌కు చెందిన వికెట్ కీపర్- బ్యాట్స్‌మెన్ మైదానంలో..
మరో నెల రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. అయితే ఈలోపే పంజాబ్ కింగ్స్‌కు చెందిన వికెట్ కీపర్- బ్యాట్స్‌మెన్ మైదానంలో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. బౌలర్లపై వీరవిహారం చేసి.. మెరుపు సెంచరీతో అల్లాడించాడు. DY పాటిల్ T20 కప్ 2023లో ప్రభసిమ్రాన్ సింగ్ శతక్కొట్టాడు. ఈ టోర్నీలో CAG తరపున ఆడుతోన్న ప్రభుసిమ్రాన్ నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో కేవలం 55 బంతుల్లోనే 161 పరుగులు చేశాడు.
ఈ సమయంలో అతడి స్ట్రైక్‌రేట్ 292.73 కాగా.. ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సిక్సర్లు ఉన్నాయి. అలాగే ప్రభసిమ్రాన్ బ్యాట్ నుంచి 9 ఫోర్లు కూడా రావడం విశేషం. ఇక అతడి తుఫాను ఇన్నింగ్స్‌తో CAG జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 267 పరుగులు చేసింది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనే కాదు టోర్నమెంట్ అంతటా ప్రభసిమ్రాన్ సింగ్ చెలరేగిపోయాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేశాడు. 110 సగటుతో అతడి స్ట్రైక్ రేట్ 250 కంటే ఎక్కువ ఉంది. అలాగే మూడు మ్యాచ్‌ల్లో కలిపి ఏకంగా 29 సిక్సర్లు బాదేశాడు. ఈ సెంచరీతో పాటు గత రెండు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సైతం నమోదు చేశాడు.
కాగా, ఐపీఎల్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఆ ఫ్రాంచైజీ ఈ ఆటగాడిని 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ గత నాలుగు సీజన్లలోనూ ఇతడికి సరైన అవకాశాలు రావట్లేదు. అయితే ప్రస్తుతం అతడి ఫామ్ బట్టి.. ఐపీఎల్ 2023లో ఛాన్స్‌లు ఇవ్వొచ్చు.
-
ప్రభసిమ్రాన్ దేశీయ రికార్డు..
ప్రభసిమ్రాన్ సింగ్ ఇప్పటివరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 49కి పైగా సగటుతో 689 పరుగులు చేశాడు. ఇది కాకుండా, లిస్ట్ A క్రికెట్‌లో, అతని బ్యాట్ 31 కంటే ఎక్కువ సగటుతో 664 పరుగులు చేసింది. టీ20ల విషయానికొస్తే.. అతడు 37 కంటే ఎక్కువ సగటుతో 1156 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 137 కంటే ఎక్కువ ఉంది. అలాగే ఈ సమయంలో ఒక సెంచరీ, 9 అర్ధ సెంచరీలు బాదేశాడు.
View this post on Instagram