Revolt RV400: రివోల్ట్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అదిరిపోయేలా బైక్ ఫీచర్లు.. 150 కిలోమీటర్ల పరిధి అందించే సూపర్ బైక్ ఇదే
రివోల్ట్ కంపెనీ ఆర్‌వీ 400 బైక్ రిలీజ్ చేసి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసింది. అయితే తక్కువ ఉత్పత్తి నేపథ్యంలో కొద్దిరోజులకే బుకింగ్స్ ఆపేసింది. ప్రస్తుతం కంపెనీ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ కంపెనీను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి బైక్స్ సరఫరా విషయంలో భారీగా పెట్టుబడి పెట్టింది.

ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ బైక్స్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా పెట్రోల్ ధరల పెరుగుదలతో చాలా మంది ఈవీ వాహనాలపై వైపు దృష్టి పెడుతున్నారు. అయితే స్కూటర్ మార్కెట్ వరకూ ఈవీ వాహనాలు ప్రభావం చూపుతున్నా స్పీడ్ బైక్స్, రేసర్ బైక్స్ వెర్షన్లలో అంతగా ఈవీ వాహనాలు అంతగా ప్రభావం చూపలేదు. అయితే కొన్ని కంపెనీలు ఈ విభాగంలో బైక్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఇదే కోవలో రివోల్ట్ కంపెనీ ఆర్‌వీ 400 బైక్ రిలీజ్ చేసి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసింది. అయితే తక్కువ ఉత్పత్తి నేపథ్యంలో కొద్దిరోజులకే బుకింగ్స్ ఆపేసింది. ప్రస్తుతం కంపెనీ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ కంపెనీను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి బైక్స్ సరఫరా విషయంలో భారీగా పెట్టుబడి పెట్టింది. అలాగే హర్యానాలోని మనేసర్‌లో ఉత్పత్తి సామర్థ్యం కూడా భారీగా పెంచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వారి వార్తలను నిజం చేస్తూ కంపెనీ కూడా ఆర్‌వీ 400 బుకింగ్స్‌ను రీఓపెన్ చేస్తున్నామని చెప్పడంతో మార్కెట్ వర్గాల అంచనాలే నిజమయ్యాయి.
ప్రస్తుతం ఈ బైక్ లవర్స్ రూ.2499 బుకింగ్ ఫీజుతో ఈ బైక్స్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే డెలివరీ డేట్‌ను మార్చి 31 లోపు సెట్ చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రివోల్ట్ మోటర్స్ ప్రస్తుతం భారతదేశంలో 22 రాష్ట్రాల్లో 35 డీలర్‌షిప్‌లతో పాన్ ఇండియా నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. సగటు బైకర్ పెట్రోల్ కోసం నెలకు రూ.3500 ఖర్చు చేస్తారని, అయితే ఆర్‌వీ 400తో ఖర్చు కేవలం రూ.350కే పరిమితమవతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ బైక్ 5 కేడబ్ల్యూ మోటర్‌తో అనుసంధానించిన 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కిలో మీటర్లు కాగా, ఓ సారి చార్జి చేస్తే దాదాపు 120 కిలో మీటర్ల పరిధితో వస్తుంది. స్లిమ్ హెడ్‌లైట్‌తో ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఈ బైక్ కచ్చితంగా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అలాగే ఈ బైక్ మూడు మోడ్స్ ఉంటాయి. ఎకో, స్పోర్ట్స్, పవర్ మోడ్స్‌లో రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఆర్‌వీ 400 మోటర్ సైకిల్ లాంటి డిజైన్‌తో ఎర్గోనామిక్స్‌లో వచ్చిన మొదటి ద్విచక్ర వాహనం. ఈ వాహనం ధర రూ.1.25 లక్షలుగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..