AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zap i300: సూపర్ డిజైన్‌తో అదిరిపోయేలా కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్ చూశారో? మతిపోతుందంతే..!

జాప్ ఐ 300 సీసీ బైక్ ఎలక్ట్రిక్ స్టెప్ త్రూ స్కూటర్‌లా కంపెనీ చెబుతుంది. ఈ లండన్, యూకే ఆధారిత సంస్థను 2017లో స్థాపించారు. ఈ బైక్‌లో జెడ్ ఆకారంలో ఉన్న ఎస్కోస్కెలిటిన్ ఫ్రేమ్ చుట్టూ స్కూటర్ వంటి స్టెప్ త్రూ డిజైన్‌తో ఉంటుంది. ఈ ఐ 300 బైక్ యాక్సలరేషన్, డైనమిక్స్‌తో బైక్ ప్రియులను ఆకట్టుకుంటుంది.

Zap i300: సూపర్ డిజైన్‌తో అదిరిపోయేలా కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్ చూశారో? మతిపోతుందంతే..!
Zaap
Nikhil
|

Updated on: Feb 21, 2023 | 11:00 AM

Share

ప్రపంచంలోని ఎలక్ట్రిక్ బైక్ ప్రియులను అబ్బురపరుస్తూ ఓ కొత్త స్టార్టప్ కంపెనీ న్యూలుక్ ఓ బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లుక్స్ పరంగానే కాకుండా ఫీచర్లపరంగా చూసుకున్నా ఈ బైక్ చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడున్న ఏ బైక్ కూడా దీని డిజైన్‌లో లేకుండా కంపెనీ కొత్తగా బైక్‌ను లాంచ్ చేశారు. ఇది పట్టణ ప్రాంతం వారికి అనుగుణంగా ఉంటుంది. అయితే జాప్ ఐ 300 సీసీ బైక్ ఎలక్ట్రిక్ స్టెప్ త్రూ స్కూటర్‌లా కంపెనీ చెబుతుంది. ఈ లండన్, యూకే ఆధారిత సంస్థను 2017లో స్థాపించారు. ఈ బైక్‌లో జెడ్ ఆకారంలో ఉన్న ఎస్కోస్కెలిటిన్ ఫ్రేమ్ చుట్టూ స్కూటర్ వంటి స్టెప్ త్రూ డిజైన్‌తో ఉంటుంది. ఈ ఐ 300 బైక్ యాక్సలరేషన్, డైనమిక్స్‌తో బైక్ ప్రియులను ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాటరీలు లేకుండా ఈ స్కూటర్ బరువు 92 కిలోలని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తేలికైన అలాయ్, కాంపోజిట్ బాడీ వర్క్‌ను ఉపయోగించడం వల్ల ఈ బైక్ ఇంత తేలికగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ బైక్ తేలికగా ఉన్నా 150 కిలోల లోడ్ పరిమితి ఉంది. అలాగే 14 అంగుళాల చక్రాలతో ఫ్రంట్ ఫోర్క్స్, మార్చుకోదగిన ఫ్రంట్ ఫెండర్, సర్దుబాటు చేయగల పుష్ రోడ్ సస్పెన్షన్ కలిగి ఉంది. 

ఈ జాప్ బైక్ 14 కెడబ్ల్యూ పవర్, 587 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే ఐపీఎం ఎలక్ట్రిక్ మోటర్ నుంచి శక్తిని పొందుతుంది. ఇది కార్బన్ ఫైబర్ బెల్ట్ డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తుంది. 2.2 సెకన్లలోనే 30 కిలో మీటర్ల స్పీడ్ అందుకోవడం ఈ బైక్ ప్రత్యేకత. అలాగే 5 సెకన్ల కంటే తక్కువలో 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 720 డబ్ల్యూహెచ్‌ సామర్థ్యంతో రెండు తొలగించగల 72 వీ లిథియం ఐయాన్ బ్యాటరీలతో ఈ బైక్ వస్తుంది. కేవలం 40 నిమిషాల్లోనే 80 శాతం వరకూ చార్జ్ చేసుకునే అవకాశం ఈ బైక్ సొంతం. అయితే ఈ బైక్ ప్రస్తుతం రిజర్వ్‌లో ఉంది. అనేక రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ లెవెల్ మోడ్ 7400 డాలర్లుగా కంపెనీ పేర్కొంది. అలాగే పరిమిత లాంచ్ ఎడిషన్ మోడలైతే 10140 డాలర్లుగా కంపెనీ ధర నిర్ణయించింది. ఈ బైక్‌ను నేరుగా జాప్ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడికైనా ఈ బైక్‌ను డెలివర్ చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!