Auto Expo: మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్ రేసర్ బైక్.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే..

ఎలక్ట్రిక్ వాహనాలంటే కేవలం నిర్దిష్ట స్పీడ్ లోనే వెళ్తాయని అందరికీ తెలిసిందే. అయితే ఈవీ వాహనాలు రేసింగ్ కు వెళ్లేంత స్పీడ్ లో ఉంటాయని ఎవరూ అనుకోరు. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేస్తూ అల్ట్రా వైలెట్ కంపెనీ కొత్త ఈవీ రేసింగ్ బైక్ లను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇప్పటికే అల్ట్రావైలేట్ ఎఫ్ 77 మార్కెట్ లోకి రిలీజ్ చేసి వినియోగదారులను ఆకట్టుకున్న కంపెనీ ఇప్పుడు ఎఫ్ 99 తో త్వరలో మార్కెట్ లోకి వస్తున్నట్లు ప్రకటించింది.

Auto Expo: మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్ రేసర్ బైక్.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే..
Ultraviolette F99
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 24, 2023 | 3:26 PM

ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతుంది. ఇటీవల గ్రేటర్ నోయిడా లో నిర్వహించిన ఆటో ఎక్స్ పో లో వివిధ కంపెనీ ప్రదర్శించిన మోడల్స్ లో చాలా వరకూ ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. దీన్ని బట్టి భవిష్యత్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలదే అని అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలంటే కేవలం నిర్దిష్ట స్పీడ్ లోనే వెళ్తాయని అందరికీ తెలిసిందే. అయితే ఈవీ వాహనాలు రేసింగ్ కు వెళ్లేంత స్పీడ్ లో ఉంటాయని ఎవరూ అనుకోరు. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేస్తూ అల్ట్రా వైలెట్ కంపెనీ కొత్త ఈవీ రేసింగ్ బైక్ లను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇప్పటికే అల్ట్రావైలేట్ ఎఫ్ 77 మార్కెట్ లోకి రిలీజ్ చేసి వినియోగదారులను ఆకట్టుకున్న కంపెనీ ఇప్పుడు ఎఫ్ 99 తో త్వరలో మార్కెట్ లోకి వస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఎఫ్ 99 ధర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

కంపెనీ మొదట రిలీజ్ చేసిన ఎఫ్ 77 లోని అన్ని స్పెసిఫికేషన్లకు మద్దతునిస్తూ ఎఫ్ 99 కు అప్ గ్రేడ్ చేశామని కంపెనీ సీఈఓ నారాయణ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎఫ్ 99 ఫ్యాక్టరీ రేసింగ్ బైక్ ను సగర్వంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 65 బీహెచ్ పీ అత్యంత శక్తివంతమైన మోటర్ తో ఈ బైక్ వినియోగదారులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. గరిష్టంగా గంటకు ఏకంగా 200 కిలో మీటర్ల స్పీడ్ పెట్రో వాహనాలకు దీటుగా ఈ బైక్ ఉంటుందని ప్రకటించారు. ఎఫ్ 99 ఫ్యాక్టరీ రేసింగ్ బైక్ లో ఏరోడైనమిక్, ఏవియేషన్ రెండింటిలో వాడే సాంకేతికతను వాడినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ బైక్ ను రేసింగ్ ట్రాక్స్ ను దృష్టి లో పెట్టుకునే రూపొందించినట్లు తెలిపారు. రేసింగ్ లో వాడే మెటీరియల్ స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు తేేలిగ్గా ఉంటేనే మరింత స్పీడ్ ను సాధించగలరని, ఈ సూత్రాన్ని అనుసరిస్తూ ఏవియేషన్ టెక్నిక్స్ ఈ బైక్ తయారీలో వాడినట్లు పేర్కొన్నారు. అయితే ఈ బైక్ ధర కానీ, ఎప్పటి నుంచి మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందో? వంటి వివరాలను మాత్రం పేర్కొనలేదు. ఈ బైక్ మాత్రం రేసర్లను కచ్చితంగా ఆకట్టకుంటుందని మాత్రం చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!