New E-Bike: సూపర్ లుక్ తో కొత్త ఎలక్ట్రిక్ రేసర్ బైక్.. ఫీచర్లు చూస్తే అదిరిపడాల్సిందే..!

ఈ- రేసర్ కంపెనీ జీరో ఎస్ఆర్/ఎఫ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ సూపర్ బైక్ లో అత్యాధునిక ఫీచర్లు బైక్ లవర్స్ ను కట్టిపడేస్తున్నాయి. డుకాటీ మూన్ స్టార్ బైక్ లా కనిపించే ఈ రేసర్ బైక్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఈ-రేసర్ బైక్ బెస్టియల్-ఈ కు చెందిన నాలుగో వెర్షన్ గా కంపెనీ పేర్కొంటుంది. 

New E-Bike: సూపర్ లుక్ తో కొత్త ఎలక్ట్రిక్ రేసర్ బైక్.. ఫీచర్లు చూస్తే అదిరిపడాల్సిందే..!
Zero Srf
Follow us
Srinu

|

Updated on: Jan 28, 2023 | 3:04 PM

ఇటాలియన్ బైక్ తయారీ కంపెనీ ఈ-రేసర్ కొత్త ఎలక్ట్రిక్ రేసర్ బైక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్ సౌండ్ రావు. దీంతో రైడర్లు సౌండ్ ఎఫెక్ట్ కోల్పోతారు. దీంతో వారి రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అనుభవించలేరు. ఈ ఇబ్బందిని అధిగమిస్తూ ఈ- రేసర్ కంపెనీ జీరో ఎస్ఆర్/ఎఫ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ సూపర్ బైక్ లో అత్యాధునిక ఫీచర్లు బైక్ లవర్స్ ను కట్టిపడేస్తున్నాయి. డుకాటీ మూన్ స్టార్ బైక్ లా కనిపించే ఈ రేసర్ బైక్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఈ-రేసర్ బైక్ బెస్టియల్-ఈ కు చెందిన నాలుగో వెర్షన్ గా కంపెనీ పేర్కొంటుంది.  స్టీమ్ లైన్ డిజైన్ తో రెండు సైడ్ స్పాయిలర్లతో వస్తుంది. అలాగే బెస్టియల్ -ఈ 2023 వెర్షన్ లో ట్యాంక్ మరింత కాంపాక్ట్ లుక్ తో వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే టెయిల్ యూనిట్ పూర్తి కార్బన్ వస్తుందని తెలిపారు. 

బెస్టియల్-ఈ ఇతర ఫీచర్లు ఇవే..

బ్రేంబో స్ట్రైల్మా శ్రేణి బ్రేకింగ్ సిస్టమ్. వెనుక మోనోషాక్ ఉంబ్రియా కెనటిక్స్ ఎయిర్ టెండర్ బ్రేక్ తో వస్తుంది. ఈ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల రైడింగ్ చేసే సమయంలో మరింత నియంత్రణ, స్థిరత్వాన్ని అందిస్తుంది. అలాగే కఠినమైన రహదారి ఉపరితలాలపై సూపర్ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. అలాగే ఈ బైక్ లో ఆడియో ఫోర్స్ బ్యాక్ సిస్టమ్ ను కొత్తగా ప్రవేశపెట్టారు. ఇలా చేయడం ద్వారా సాధారణ బండిలానే దీని ఇంజిన్ సౌండ్ వస్తుంది. దీని వల్ల డ్రైవ్ చేసే సమయంలో ఇతరులకు బండి వచ్చే సౌండ్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబతున్నారు. అలాగే భద్రత పరంగా కూడా అధునాతన ఫీచర్లతో తమ బైక్ వస్తుందని తెలిపారు. అయితే దీని ధర వివరాలు మాత్రం అందుబాటులో లేవు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం