One Plus Smart Watch: ఈ స్మార్ట్ వాచ్ ధర తగ్గిందోచ్చ్..! అందుబాటులో ఇతర తగ్గింపు ఆఫర్లు.. ధరెంతో తెలుసా?
రూ.4999 ధరతో విడుదల చేసిన వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ వాచ్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ కంపెనీ తగ్గింపు ధరను ఆఫర్ చేస్తుంది. రూ.500 తగ్గిస్తూ రూ.4499 కు వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ టీవీలు, స్మార్ట్ వాచ్ లను కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఇటీవలే రూ.4999 ధరతో విడుదల చేసిన వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ వాచ్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ కంపెనీ తగ్గింపు ధరను ఆఫర్ చేస్తుంది. రూ.500 తగ్గిస్తూ రూ.4499 కు వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్ వాచ్ మిడ్ నైట్ బ్లాక్, డీప్ బ్లూ రంగుల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఈ వాచ్ కొనుగోలు చేస్తే ఇతర తగ్గింపు ఆఫర్లు కూడా వర్తించే అవకాశం ఉంది. ఈ వాచ్ ను ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.500 ఇన్ స్టెంట్ గా తగ్గుతుంది. అలాగే మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా కొంటే రూ.500 వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది.
- వన్ ప్లస్ నార్డ్ వాచ్ స్పెసిఫికేషన్లు ఇవే..
- 1.78 ఇంచ్ ల ఎమో ఎల్ఈడీ డిస్ ప్లే, 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్ నెస్.
- ఆండ్రాయిడ్ 6.0, ఐఓఎస్ 11 వెర్షన్ల సపోర్ట్
- ఎన్ హెల్త్ యాప్ కనెక్టవిటీతో రోజు వారి నడక, ఇతర ఆరోగ్యంపై సమీక్షించుకునే అవకాశం.
- ఎస్ పీ ఓ2, హార్ట్ రేట్, స్ట్రెస్ రేట్ లను వీక్షణ
- అలాగే ఆడవాళ్లకు ఉపయోగపడేలా మెనుస్ట్రాల్ సైకిల్ ను ట్రాక్ చేసుకునే అవకాశం.
- 10 రోజుల పాటు పని చేసే పవర్ ఫుల్ బ్యాటరీ
- బ్లూటూత్ 5.2 ద్వారా స్మార్ట్ కనెక్టింగ్
- ఐపీ 68 ద్వారా డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..