Recharge & OTT: జియో యూజర్లకు నిరాశ..కేవలం ఎయిర్ టెల్, వీఐ యూజర్లకే ఈ సేవలు..అవేంటో తెలుసా?
అందరూ స్మార్ట్ ఫోన్ లో వీడియోస్, షోస్, సినిమాలు చూడడానికి ఇష్టపడుతన్నారు. వినియోగదారుల అభిరుచికి తగినట్లుగానే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాయి. అందులో వారికి అనుగుణంగా వివిధ షోలు, సినిమాలు వస్తున్నాయి.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ట్రెండ్ నడుస్తుంది. ఇది వరకూ కేవలం కాలింగ్ అవసరాలకే పరిమితమైన ఫోన్ ఇప్పుడు ప్రతి చిన్న అవసరానికి తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ కు ఫోన్ కంపల్సరీ వస్తువుగా మారింది. భారత్ లో డేటా వినియోగం పెరిగిన నాటి నుంచి అందరూ స్మార్ట్ ఫోన్ లో వీడియోస్, షోస్, సినిమాలు చూడడానికి ఇష్టపడుతన్నారు. వినియోగదారుల అభిరుచికి తగినట్లుగానే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాయి. అందులో వారికి అనుగుణంగా వివిధ షోలు, సినిమాలు వస్తున్నాయి. అయితే ఓటీటీ సేవలను ఆనందించడానికి సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలి. మొదట్లో వీటి ధరలు అందుబాటులోనే ఉన్నా ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో ఓటీటీ, రీచార్జి రెండూ చేయించుకోడానికి మధ్య తరగతి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని కంపెనీలు కేవలం రీచార్జితోనే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఓటీటీ+ రీచార్జి బెన్ ఫిట్స్ అందించే ఆ కంపెనీలు, ప్లాన్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
- ఎయిర్ టెల్
- రూ.399 ప్లాన్ తో 28 రోజుల పాటు అపరమిత కాలింగ్ తో పాటు, రోజుకు 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు వస్తాయి. వీటితో పాటు 3 నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్ స్క్పిప్షన్ పాటు వస్తుంది.
- రూ.499 ప్లాన్ తో మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో పాటు రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరమిత కాలింగ్ సదుపాయాలతో వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.
- రూ.699 ప్లాన్ తో అపరిమిత కాలింగ్, డైలీ 100 ఎస్ఎంఎస్ లు, 3 జీబీ డేటాతో పాటుగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
- రూ.719 ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్ , డైలీ 100 ఎస్ఎంఎస్ లు, 1.5 జీబీ డేటా వస్తుంది. వీటితో పాటు అదనంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా వస్తుంది.
- రూ.779 ప్లాన్ తో 3 నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో పాటు, అపరమిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు వస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 80 రోజులు.
- రూ.839 ప్లాన్ తో 3 నెలల హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో అపరిమిత కాలింగ్, డైలీ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు వస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.
- రూ.999 ప్లాన్ తో 3 నెలల హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో అపరిమిత కాలింగ్, డైలీ 2.5 జీబీ డేటా వస్తుంది. అలాగే 100 ఎస్ఎంఎస్ లు కూడా వస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు
వీఐ ప్లాన్స్
- రూ.399 ప్లాన్ తో అపరిమిత కాలింగ్ తో పాటు, డైలీ 100 ఎస్ఎంఎస్ లు, రోజుకు 2.5 జీబీ డేటా తో వస్తుంది. వీటితో పాటు మూడు నెలల డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. వినియోగదారులు వీఐ యాప్ ద్వారా రీచార్జి చేసుకుంటే అదనంగా 5 జీబీ డేటాను కూడా పొందవచ్చు.
- రూ.499 ప్లాన్ తో ఒక సంవత్సరం పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో పాటు 28 రోజుల వ్యాలిడిటీతో డైలీ 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ లు వినియోగదారులు పొందుతారు. వినియోగదారులు వీఐ యాప్ ద్వారా రీచార్జి చేసుకుంటే అదనంగా 5 జీబీ డేటాను కూడా పొందవచ్చు.
- రూ.901 ప్లాన్ తో సంవత్సరం పాటు డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో పాటు 70 రోజుల అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 3 జీబీ రోజువారీ డేటాతో వస్తుంది. అలాగే 48 జీబీ అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
అయితే ఈ జియోకు మాత్రం ఓటీటీ ప్లస్ రీచార్జి ప్లాన్స్ ఏమీ అందుబాటులో లేవు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..