Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్స్.. 30 రోజుల వ్యాలిడిటీతో..
Airtel Recharge Plans: టెలికం కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. నెలవారీగా రీచార్జ్ చేసుకునే ప్లాన్స్ ఒక్కటైనా అందించాలని టెలికం..
Airtel Recharge Plans: టెలికం కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. నెలవారీగా రీచార్జ్ చేసుకునే ప్లాన్స్ ఒక్కటైనా అందించాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ (TRAI) ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల కిందట జియో (Jio) తన యూజర్ల కోసం క్యాలెండర్ మంత్లీ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ (Airtel) కూడా తన యూజర్ల కోసం 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌ను తీసుకువచ్చింది.
ఎయిర్‌టెల్ కొత్తగా రూ.296, రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. ఈప్లాన్స్‌తో యూజర్లు 30 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.296 ప్లాన్‌తో 25జీబీ డేటా, అపరిమితి కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 30 రోజుల వ్యాలిడిటీతో రానుంది. ఇక రూ.319 ప్లాన్‌తో రోజు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు, 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. అలాగే యూజర్లు 30 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచిత ట్రయల్, మూడు నెలల అపోలో 24×7 సర్కిల్ సేవలు, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, వింక్ మ్యూజిక్ వంటి సదుపాయాలు యూజర్లు పొందవచ్చు.
ఇవి కూడా చదవండి: