Petrol Price Today: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ఎంతకు చేరిందంటే.

Petrol Price Today: దేశంలో ఇంధన ధరలు (Fuel Rates) దూకుడు మీదున్నాయి. ఆకాశం హద్దుగా పెరిగిపోతున్నాయి. కొన్ని నెలలపాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol Price Today: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ఎంతకు చేరిందంటే.
Petrol Diesel Rates Today
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 05, 2022 | 8:50 AM

Petrol Price Today: దేశంలో ఇంధన ధరలు (Fuel Rates) దూకుడు మీదున్నాయి. ఆకాశం హద్దుగా పెరిగిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో సుమారు 3 నెలలపాటు స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Petrol And Diesel Rates) ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పెరగడం ప్రారంభమయ్యాయి. ప్రతీ రోజూ ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్‌ ధరలు పెట్రోల్‌తో పోటీపడీ మరీ పెరిగే పరిస్థితి ఉంది.

కొన్ని ప్రాంతాల్లో అయితే లీటర్‌ డీజిల్‌ ఏకంగా రూ. 100 దాటేసింది. మంగళవారం దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 103.81 కాగా, డీజిల్‌ రూ. 95.07 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 118.83 గా ఉండగా, డీజిల్‌ రూ. 103.07 గా నమోదైంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 109.34 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 99.42 గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 109.41 కాగా, డీజిల్‌ రూ. 93.23 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 117.68 గా ఉండగా, డీజిల్‌ రూ. 103.75 గా నమోదైంది.

* విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 119.78 ఎగబాకింది, ఇక డీజిల్‌ రూ. 105.45 కి చేరింది.

* సాగర తీరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 119.65 కి చేరగా, డీజిల్ రూ. 104.72 వద్ద కొనసాగుతోంది.

* గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120.38, డీజిల్‌ ధర రూ.106.04గా ఉంది.

Also Read: Horoscope Today: ఆ రాశివారు ఆత్మీయులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.. ఖర్చులు పెరుగుతాయి

Sun Charged Water: వేసవిలో సన్ ఛార్జ్ నీళ్లు తాగితే ఈ వ్యాధులు తగ్గుతాయి.. ప్రయోజనాలు తెలుసుకోండి..

Senior Citizens: సీనియర్ సిటిజన్లకి బంపర్‌ ఆఫర్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదిరిపోయే రిటర్న్స్‌..!