OnePlus 10 Pro: మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఔరా అనాల్సిందే..
OnePlus 10 Pro: భారత స్మార్ట్ ఫోన్ రంగంలో తనదైన ముద్ర వేసిన వన్‌ప్లస్ ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. మొన్నటి వరకు బడ్జెట్ ఫోన్‌లను తీసుకొచ్చిన వన్‌ప్లస్ తాజాగా..
OnePlus 10 Pro: భారత స్మార్ట్ ఫోన్ రంగంలో తనదైన ముద్ర వేసిన వన్‌ప్లస్ ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. మొన్నటి వరకు బడ్జెట్ ఫోన్‌లను తీసుకొచ్చిన వన్‌ప్లస్ తాజాగా ప్రీమియం రేంజ్ ఫోన్‌ను లాంచ్ చేసింది. వన్ ప్లస్ 10 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ నేటి నుంచి (మంగళవారం) అందుబాటులోకి వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా వన్‌ప్లస్ 10 ప్రో ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాలు..
వన్‌ప్లస్ 10ప్రోలో ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్ క్యూహెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్-1 5జీ ప్రాసెసర్‌తో నడుస్తుంది. బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 80 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీంతో ఈ ఫోన్ కేవలం 15 నిమిషాల్లోనే 70 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని వన్‌ప్లస్ చెబుతోంది.
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. వీడియో రికార్డింగ్ కోసం మూవీ మోడ్ అనే ఫీచర్‌ను ప్రత్యేకంగా ఇచ్చారు. దీంతో హైక్వాలిటీ ఫోటోలను తీసుకొచ్చింది. ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేశారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర రూ. 66,999 కాగా, 12 జీబీ+256 జీబీ ధర రూ. 71,999గా ఉంది. ఏప్రిల్ 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
Also Read: Viral Video: చూసుకోవాలి కదమ్మా..! ముక్కు పగిలింది.. అద్దం బద్దలైంది.. ఫన్నీ వీడియో
Food Poisoning: వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ సమస్య అధికం.. చెక్ పెట్టాలంటే ఈ విషయాలను తెలుసుకోండి