- Telugu News Photo Gallery Technology photos Feeling the summer heat Buy these affordable Air Coolers below Rs.5000 to stay cool indoors
Coolers Below 5k: వేసవి ఉక్కబోతను భరించలేకపోతున్నారా.? రూ. 5 వేల లోపు బెస్ట్ కూలర్లపై ఓ లుక్కేయండి..
Coolers Below 5k: దంచికొడుతోన్న ఎండల కారణంగా ఉక్కపోత పెరిగిపోయింది. దీంతో కూలర్ల కొనుగోల్లు మొదలయ్యాయి. మీరు కూడా కొత్త కూలర్ కొనాలనుకుంటున్నారా.? అయితే రూ. 5 వేల లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ కూలర్స్ వివరాలు చూడండి..
Updated on: Apr 05, 2022 | 12:25 PM

ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. విపరీతమైన ఉక్కపోత కారణంగా చాలా మంది ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా కొత్తగా కూలర్ కొనాలనే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని కూలర్ల వివరాలు.

Crompton Ginie Neo(ACGC-PAC10) Tower Air Cooler: ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌కి పెట్టింది పేరైన క్రామ్టన్ కంపెనీకి చెందిన ఈ కూలర్ అసలు ధర రూ. 4,900 ఉండగా ఆఫర్‌లో భాగంగా అమెజాన్‌లో రూ. 4,290కి అందుబాటులో ఉంది. ఈ కూలర్‌లో వాటర్ లెవల్ ఇండికేటర్‌ను అందించారు. కూలర్‌పై ఏడాది వారెంటీ ఉంటుంది.

Crompton Ginie Neo Table-Top Personal Air Cooler: ఈ కూలర్ 10 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. మోటర్ ఓవర్‌లోడ్ ప్రొటెక్టర్ దీని ప్రత్యేకత. ఈ కూలర్ అసలు ధర రూ. 4,900 కాగా డిస్కౌంట్‌లో భాగంగా అమెజాన్‌లో రూ. 3,950కి అందుబాటులో ఉంది.

Vistara Nexa Portable Air Cooler: రూ. 5వేల లోపు అందుబాటులో ఉన్న కూలర్లలో విస్తారా కంపెనీకి చెందిన ఈ కూలర్ ఒకటి. ఈ కూలర్ అసలు ధర రూ. 8,999 కాగా అమెజాన్‌లో డిస్కౌంట్‌తో రూ. 4,999కి అందుబాటులో ఉంది. దీంతో పాటు కొన్ని కార్డులపై 10 శాతం డిస్కౌంట్ కూడా ఉంది.

BLUE STAR Astra PA10PMA: చిన్న గది ఉన్న వారికి ఈ కూలర్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. చల్లటి గాలిని పొందే క్రమంలోనే ఇందులో ఐస్ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు డస్ట్ ఫిల్టర్ దీని మరో ప్రత్యేకత. ఇక ధర విషయానికొస్తే అసలు ధర రూ. 6,490 కాగా ఆఫర్‌లో భాగంగా అమెజాన్‌లో రూ. 4,799కి అందుబాటులో ఉంది.

Usha Maxx Air 70MD1 70-Litre Desert Cooler: ఉషా కంపెనీకి చెందిన ఈ కూలర్ రూ. 4000కు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో సిటీబ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. ఈ కూలర్‌పై ఏడాది వారెంటీ అందిస్తారు.





























