- Telugu News Photo Gallery WhatsApp takes action on app misuse bans more than 1 million Indian accounts in February
WhatsApp: యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్.. 14.26 లక్షల భారతీయ ఖాతాలపై నిషేధం.. ఎందుకంటే..!
WhatsApp: వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్నా నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ కొందరు ఈ యాప్‌ను దుర్వినియోగం చేస్తున్నారు..
Updated on: Apr 04, 2022 | 8:07 AM

WhatsApp: వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్నా నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ కొందరు ఈ యాప్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. తప్పుడు పోస్టులు పెట్టడం, అనుమతి లేని పోస్టులను చేయడం వంటివి కారణంగా వాట్సాప్ సంస్థ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాట్సాప్ 14.26 లక్షల భారతీయ ఖాతాలను మూసివేసింది. నిబంధనలు ఉల్లంఘించే కంటెంట్ పోస్టు చేస్తున్నారని పలు ఫిర్యాదుల తర్వాత వాట్సాప్ ఈ చర్య తీసుకుంది.

కంపెనీ తన నెలవారీ నివేదికలో ఈ సమాచారాన్ని అందించింది. కంపెనీ ప్రకారం వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 28 వరకు 335 భారతీయ ఖాతాలపై ఫిర్యాదులు అందాయి. ఇందులో 194 ఖాతాలను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా వాట్సాప్‌లో ఇష్టానుసారంగా పోస్టులు చేయడం వల్ల వాట్సాప్ కంపెనీ ఈ చర్యలు చేపట్టింది.

వాట్సాప్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున అకౌంట్లను తొలగించింది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి చర్యలు తీసుకున్నామని, వినియోగదారుల నుండి ఫిర్యాదులు వస్తున్న కారణంగా వారిపై చర్యలు తీసుకున్నట్లు WhatsApp తెలిపింది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానం వినియోగదారుల చాట్‌లను సురక్షితంగా ఉంచుతుంది. అటువంటి వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖాతా నుండి వచ్చిన సందేశాలు, ఎన్‌క్రిప్షన్ లేకుండా పని చేసే ఫీచర్‌లు, వినియోగదారుల నుండి వచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుంది. సోషల్ మీడియా కంపెనీలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం మే 2021లో కొత్త ఐటీ నిబంధనలను ప్రవేశపెట్టింది.

కొత్త ఐటీ నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు ప్రతి నెలా నివేదికలను జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఖాతాను నిషేధించవచ్చు. అందుకే అలాంటి కంటెంట్‌ను షేర్ చేయకండి. మీ ఖాతాను సురక్షితంగా ఉంచండి.




