- Telugu News Photo Gallery Know the health benefits of eating clarified butter or desi ghee in summer telugu health care
Ghee Benefits: వేసవిలో నెయ్యి తినడం మానేస్తున్నారా..? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి
Ghee Summer Diet: నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. చలికాలంలో నెయ్యి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. అయితే వేసవిలో కూడా దేశీ నెయ్యి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు. వేసవిలో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
Updated on: Apr 04, 2022 | 6:48 AM

తక్షణ శక్తిని ఇస్తుంది: నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి ఎన్నో పోషకాలు అందిస్తాయి. దీన్ని పరిమిత పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. నెయ్యి తినడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందుతాయని.. దీంతో ఆరోగ్యవంతంగా ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి: వేసవిలో శరీరం డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అధికంగా చెమట వస్తుంది. అయితే.. క్రమం తప్పకుండా నెయ్యి తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు. కావాలంటే నెయ్యి చర్మానికి రాసుకుని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే.. పలు రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడుతుంటాయి. అయితే నెయ్యిలో ఉండే గుణాలు రోగ నిరోధక శక్తిని బలపేతం చేస్తాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆహార పదార్థాలతోపాటు నెయ్యి కలిపి అందించడం మంచిది.

ఎముకలకు: నెయ్యి ఎముకలకు కూడా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వాస్తవానికి ఎముకలకు అవసరమైన విటమిన్ K2 నెయ్యిలో పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరానికి కాల్షియం అందించడానికి పనిచేస్తుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

ఉదర సమస్యలు దూరం: నెయ్యి తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. వేసవిలో మీకు తరచుగా మలబద్ధకం సమస్య ఉంటే ప్రతిరోజూ నెయ్యితో చేసిన వాటిని తినాలని సూచిస్తున్నారు. ఇది మీకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

అందుకే వేసవి కాలంలో కూడా నెయ్యి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిమితంగా మాత్రమే తీసుకోవాలని పేర్కొంటున్నారు.




