ఏప్రిల్‌లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదుకాబోతున్నాయి. రానున్న 5 రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వీటిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశానికి సంబంధించిన విషయం. అయితే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం డెత్ వ్యాలీ. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటుంది.