Ramadan 2022: సెహ్రీ, ఇఫ్తార్ విందులో ఖర్జూరాలు తప్పనిసరిగా తింటారు? ఎందుకో తెలుసా..
ఖర్జూరంలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లు ఉంటాయి. విటమిన్ ఎ, బి, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఎన్నోపోషకాలు ఉండటం వల్ల ఖర్జూరాలను సూపర్‌ఫుడ్ (superfood) అని అంటారు. అందుకే..
Updated on: Apr 04, 2022 | 10:36 AM

Breaking fast with dates benefits: ఖర్జూరంలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లు ఉంటాయి. విటమిన్ ఎ, బి, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఎన్నోపోషకాలు ఉండటం వల్ల ఖర్జూరాలను సూపర్‌ఫుడ్ (superfood) అని అంటారు. అందుకే సెహ్రీ (Sehri), ఇఫ్తార్‌లో ఈ పండు ఎప్పుడూ ఉంటుంది.

సెహ్రీ (ఉపవాసానికి ముందు ఉదయాన్నే ముస్లీంలు తీసుకునే ఆహారం)లో ఖర్జూరాన్ని తింటే, అది రోజంతా శక్తిని నింపుతుంది. దీంతో రంజాన్ మాసంలో శరీరంలో పోషకాహాక లోపం దరి చేరదు.

అలాగే ఇఫ్తార్ తర్వాత అంటే ఉపవాసం విరమించిన తర్వాత కూడా ఖర్జూరాన్ని మొదటాగా తినడానికి కూడా కారణం ఇదే. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిని ఇఫ్తార్, సెహ్రీలో ముస్లీంలు తప్పకుండా తింటారు. ఒకవేళ ఉపవాసం లేకపోయినా అల్పాహారంగా ఖర్జూరాన్ని తినొచ్చు.

గుండె సమస్యలు ఉన్నవారికి ఖర్జూరం చాలా మంచిది. వీటిలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఐతే వీటిని తినేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. కిడ్నీ సమస్యలున్నవారు కూడా ఖర్జూరం తినకపోవడం మంచిది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఖర్జూరం ఎంతో మేలు చేస్తుంది. డయాబెటీస్‌తో బాధపడేవారు, ఉపవాసం ఉన్నట్లయితే, అటువంటి వారు తప్పనిసరిగా ఖర్జూరం తినాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

ఖర్జూరాలు శరీరంలో జీవక్రియను ప్రేరేపిస్తాయి. High blood pressure తో బాధపడేవారు కూడా ఖర్జూరాలు తినొచ్చు.

రక్తహీనతతో బాధపడేవారు ఐరన్ అధికంగా ఉండే ఖర్జూరాలు తప్పకుండా తినాలి. గర్భిణీ స్త్రీలు, ఐరన్ లోపంతో బాధపడేవారు ఖర్జూరం ప్రతిరోజూ తినాలి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.





























