AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Check Payment: చెక్‌ పేమెంట్లపై ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమలు..!

Check Payment: ప్రతినెల వివిధ అంశాలలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఆర్థిక లావాదేవీలు జరిపే వారు కొన్ని..

Check Payment: చెక్‌ పేమెంట్లపై ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమలు..!
Subhash Goud
|

Updated on: Apr 04, 2022 | 6:59 AM

Share

Check Payment: ప్రతినెల వివిధ అంశాలలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఆర్థిక లావాదేవీలు జరిపే వారు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం మంచిది. దేశంలో చెక్‌ (Check )పేమెంట్‌ విధానంలో మార్పులు జరిగాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆదేశాల మేరకు బ్యాంకు చెక్‌ పేమెంట్ల విషయంలో మార్పులు చేశాయి ఆయా బ్యాంకులు. అదే పాజిటివ్‌ పే విధానం (Positive Pay System). ఇందులో భాగంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) నేటి నుంచి అంటే ఏప్రిల్‌ 4 నుంచి పాజిటివ్ పే సిస్టమ్‌ను అమలు చేయబోతుంది.

ఈ పాజిటివ్‌ పే విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు.. తన కస్టమర్లకు వెబ్‌సైట్‌ ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తోంది. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి కస్టమర్లు రూ.10 లక్షలు లేదా అపై ఉన్న చెక్‌ పేమెంట్లకు పాజిటివ్‌ పే విధానాన్ని తప్పనిసరిగ్గా పాటించాలని బ్యాంకు సూచించింది. ట్విట్టర్‌లో పీఎస్‌బీ చెక్‌ పేమెంట్లపై ఫిబ్రవరిలో చేసిన ట్వీట్‌ను పిన్‌ చేసింది. ఈ విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది.

పాజిటివ్‌ పే విధానం కోసం బ్యాంకు కస్టమర్లు తమ అకౌంట్‌ నెంబర్‌ను, చెక్‌ నెంబర్‌, లేదా ఆల్ఫా, చెక్‌ తేదీ, చెక్‌ మొత్తం, అలాగే ఎవరి పేరుతో ఈ చెక్‌ను జారీ చేస్తున్నారు.. వంటి విషయాలను బ్యాంకుకు ముందుగానే అందించాల్సి ఉంటుంది. బ్యాంకు సిబ్బంది ఈ విషయాలను ధృవీరించిన తర్వాతే చెక్‌ చెల్లుబాటు అవుతుంది. అయితే పాజిటివ్‌ పే విధానం గురించి మరిత సమాచారం తెలుసుకోవాలంటే టోల్‌ ప్రీ నంబర్‌ 1800-180-2222 లేదా 1800-103-2222 కాల్ చేసి తెలుసుకోవచ్చని పీఎంబీ బ్యాంకు చెబుతోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అమల్లోకి తీసుకువచ్చాయి. బ్యాంకింగ్‌ విధానంలో జరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.

Pnb Bank

ఇవి కూడా చదవండి:

Aadhaar Mobile Number: మీ ఆధార్‌కు ఏ మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేశారో తెలియడం లేదా..? సులభంగా తెలుసుకోవచ్చు..!

Fixed Deposit: ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చింది.. కొత్త రేట్లు ఇలా ఉన్నాయి..!