Aadhaar Mobile Number: మీ ఆధార్‌కు ఏ మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేశారో తెలియడం లేదా..? సులభంగా తెలుసుకోవచ్చు..!

Aadhaar Mobile Number:  భారతదేశంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది పనులు జరగవు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రైవేటు స్కీమ్స్‌కు, బ్యాంకింగ్‌..

Aadhaar Mobile Number: మీ ఆధార్‌కు ఏ మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేశారో తెలియడం లేదా..? సులభంగా తెలుసుకోవచ్చు..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 02, 2022 | 11:23 AM

Aadhaar Mobile Number:  భారతదేశంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది పనులు జరగవు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రైవేటు స్కీమ్స్‌కు, బ్యాంకింగ్‌ రంగాలకు తప్పనిసరిగ్గా కావాల్సిందే. అలాగే ప్రతి ఒక్కరు ఆధార్‌ కార్డు (Aadhaar Card)కు మొబైల్‌ నంబర్‌ (Mobile Number)లింక్‌ చేయడం తప్పనిసరి. మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. మీరు ఎక్కడైన ఆధార్‌ ఉపయోగించినప్పుడు మొబైల్‌కు ఓటీపీ వస్తుంటుంది. ఆధార్‌ దుర్వినియోగం కాకుండా మొబైల్‌ నంబర్‌ ఓటీపీ ఎంతోగా ఉపయోగపడుతుంది. అయితే మీకు ఆధార్‌కు ఏ మొబైల్‌ నంబర్‌ అనుసంధానం చేశారో గుర్తు లేకపోతే టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. నిమిషాల వ్యవధిలోనే మీరు ఆధార్‌కు ఏ నంబర్‌ లింక్‌ చేశారో తెలుసుకోవచ్చు.

ఆధార్‌కు ఏ మొబైల్‌ నంబర్‌ లింకు చేశారో తెలుసుకోండిలా..

☛ ముందుగా ఏదైనా బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి అధికారిక వెబ్‌సైట్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI)ను సందర్శించండి.

☛ My Aadhaar సెక్షన్‌లో Aadhaar Services లో Verify Email / Mobile Number ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

☛ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

☛ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన Send OTP పైన క్లిక్ చేయాలి.

☛ మీరు సరైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే The Mobile Number xxxxxxxxxx matches with our records అని వస్తుంది.

☛ ఆధార్ కు లింక్ లేని నంబర్‌ను ఎంటర్ చేస్తే The Mobile number you had entered does not match with our records అని వస్తుంది.

☛ ఇలా వచ్చినట్లయితే మరో నెంబర్‌తో ట్రై చేయాలి.

☛ మీరు ఇలాగే ఇమెయిల్ ఐడీని కూడా వెరిఫై చేయవచ్చు.

అయితే అసలు మొబైల్ నెంబర్ ఏదో ఏమాత్రం ఐడియా కూడా లేకపోతే ఎలా తెలుసుకోవాలన్న అనుమానం కూడా వస్తుంది. ఇది కూడా సాధ్యం అవుతుంది. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో మీరు మీ ఆధార్ నెంబర్‌కు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో సులువుగా తెలుసుకోవచ్చు.

☛ ముందుగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్  ఓపెన్ చేయండి.

☛  My Aadhaar సెక్షన్‌లో Aadhaar Services లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయండి.

☛  ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.

☛  Proceed to Verify పైన క్లిక్ చేయండి.

☛  Aadhaar Number xxxxxxxxxxxx Exists అని వస్తుంది.

☛  దాంతో పాటు మొబైల్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ చివరి 3 అంకెలు కనిపిస్తాయి. ఇలా అంకెలు కనిపిస్తే మీకు ఏ మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేశారో విషయం తెలిసిపోతుంది.

☛  మొబైల్ నెంబర్ స్థానంలో ఖాళీగా ఉంటే ఆ ఆధార్ నంబర్‌కు ఏ ఫోన్ నంబర్ లింక్ కాలేదని అర్థం.

ఇవి కూడా చదవండి:

Glue: జిగురు బాటిల్‌ లోపల ఎందుకు అంటుకోదు.. దీనికి కారణం ఏమిటి..?

Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఇబ్బందులు తీర్చేందుకు సరికొత్త ఫీచర్