Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు.. ఒక చోట తగ్గితే.. మరో చోట పెరిగాయి..!
Gold Silver Price Today: ఉక్రెయిన్-రష్యా యుద్ధాలు ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇక బంగారం, వెండి విషయానికొస్తే భారతీయులు (Indians) పసిడికి..
Gold Silver Price Today: ఉక్రెయిన్-రష్యా యుద్ధాలు ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇక బంగారం, వెండి విషయానికొస్తే భారతీయులు (Indians) పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా సోమవారం (ఏప్రిల్ 4)న దేశం (India)లో బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉంటే కొన్ని ప్రాంతాల్లో పెరిగాయి. ఇక మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గుముపట్టాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే బంగారం ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ ధరలు ఈ రోజు తెల్లవారుజామున నమోదైనవి. కొనుగోలు చేసే ముందు ధర ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,460, ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,630, అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,460 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,460 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,460 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,460, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,460 ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర ధర రూ.68,800 ఉండగా, ముంబైలో రూ.66,800 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కోల్‌కతాలో రూ.66,800 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కేరళలో రూ.71,300 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, విజయవాడలో రూ.71,300 వద్ద కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి: