Best 2 Ton Ac’s: వెచ్చని వేసవిని చేయండి.. కూల్‌కూల్‌గా..! అందుబాటులో ఉన్న బెస్ట్ ఏసీలు ఇవే..
పెద్ద గదులకు ఏసీ పెట్టాలంటే కచ్చితంగా 2 టన్ కెపాసిటీ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండు టన్నుల కెపాసిటీ ఉన్న స్ప్లిట్ ఏసీ వేసవితాపాన్ని తీరుస్తుందని పేర్కొంటున్నారు. ధర విషయంలో పెద్దగా ఆలోచించకుండా కేవలం మన్నిక, అవసరాలను గుర్తించి ఏసీలు కొనుగోలు చేయాలంటున్నారు.

ఈ సారి వేసవిలో ఎండలు బాగా ఉంటాయని కొందరు నిపుణులు చెబుతున్న మాట. అయితే వారి మాటలు ఎలా ఉన్నా ఫిబ్రవరిలోనే ఎండలు మంటెక్కెస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడనంత వేడి ఫిబ్రవరిలోనే ప్రారంభమైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏసీల వాడకం తప్పనిసరైంది. అయితే ప్రస్తుతం చాలా మంది పడక గదులు పెద్దగానే ఉంటున్నాయి. ఎందుకంటే పెరిగిన అవసరాల నేపథ్యంలో పట్టణ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంత పెద్ద గదులకు ఏసీ పెట్టాలంటే కచ్చితంగా 2 టన్ కెపాసిటీ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండు టన్నుల కెపాసిటీ ఉన్న స్ప్లిట్ ఏసీ వేసవితాపాన్ని తీరుస్తుందని పేర్కొంటున్నారు. ధర విషయంలో పెద్దగా ఆలోచించకుండా కేవలం మన్నిక, అవసరాలను గుర్తించి ఏసీలు కొనుగోలు చేయాలంటున్నారు. నిపుణులు సూచించే 2 టన్ స్ప్లిట్ ఏసీల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఎల్‌జీ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ
భారతదేశంలో ఎల్‌జీ సంస్థ తయారు చేసే ఎలక్ట్రిక్ వస్తువులు అత్యంత ప్రజాధరణ పొందాయి. ఈ సంస్థ రూపొందించిన ఏసీలు కూడా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. రూ.55,590 ధరకు అందుబాటులో ఉండే ఎల్‌జీ 2 టన్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ ప్రస్తుత అవసరాలకు సరిపోతుందని నిపుణుల వాదన. రస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తున్న ఈ ఏసీ కాపర్ కండెన్సర్, స్టెబిలైజర్ ఫ్రీ ఆప్షన్లతో వస్తుంది. కాబట్టి ఈ ఏసీ కొనుగోలు ఓ మంచి ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.
వోల్టాస్ 2 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ
స్వదేశి సంస్థ అయిన టాటా కంపెనీకు చెందిన వోల్టాస్ ఏసీలు కూడా భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ కంపెనీ ఇచ్చే 5 స్టార్ 2 టన్ను ఏసీలు మధ్యస్థ, పెద్ద పరిమాణంలో ఉన్న గదులకు సరిగ్గా సరిపోతుంది. కాపర్ కండెన్సర్ కాయిల్‌తో వస్తున్న ఈ ఏసీలో హై యాంబియంట్ కూలింగ్, స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 58,890.
హిటాచీ స్ప్లిట్ ఏసీ
హిటాచీ కంపెనీ నుంచి వచ్చే ఈ 2 టన్ ఏసీ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వస్తుంది. ఇది భారాన్ని బట్టి శక్తిని సర్దుబాటు చేసుకునేలా డిజైన్ చేశారు. మెరుగైన కూలింగ్ కోసం కాపర్ కండెన్సర్‌తో ఈ ఏసీ వస్తుంది. ఎంత పెద్ద గది అయినా ఒకే రకమైన కూలింగ్ అందించడం దీని ప్రత్యేకత. ఈ ఏసీ ధర రూ.49,540.
క్యారియర్ 2 టన్ స్ల్పిట్ ఏసీ
ఈ ఏసీ భారతదేశంలో 2 టన్ను కెపాసిటీలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఏసీల్లో ఒకటి. స్పీడ్ కూలింగ్ కోసం కాపర్ కండెన్సర్‌తో ఈ ఏసీ రానుంది. ఇది పెద్ద గదులకు సరిగ్గా సరిపోతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా షాపుల్లో ఏసీ పెట్టుకోవాలనుకునే వారు ఈ ఏసీని పెట్టుకోవడం ఉత్తమం. దీని ధర రూ.50, 490గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






