Air Conditioner: ఏసీ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే ??
ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు సైతం పెరిగిపోయాయి. దీంతో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు సైతం పెరిగిపోయాయి. దీంతో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇక ఎయిర్ కండీషనర్ల ధరలు త్వరలో పెరగనున్నాయి. ఏసీల నాణ్యత ప్రమాణాలను బట్టి 7 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏసీలు కొనేవారికి అధిక భారం పడనుంది. దేశంలో ఏసీల ఇంధన వినియోగ ప్రమాణాలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీసియెన్సీ (BEE) ఏప్రిల్ 19న జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు వచ్చే నెల నుంచి ఈ కొత్తరేట్లు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కొత్త మార్గదర్శకాలను ఎలా అమలు చేయబోతున్నారనే దానిపై AC తయారీదారులు వెల్లడించలేదు. మార్గదర్శకాల ప్రకారం.. AC తయారీదారులు తమ మోడల్ డిజైన్‌లను కొంచెం మార్చవలసి ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళ ఐడియా అదిరింది గురూ !! ఇక్కడ భర్తను అద్దెకు ఇవ్వబడును !!
51 ఏళ్ళ వయసులో తన కొడుకు మాజీ లవర్‌ను పెళ్ళి చేసుకున్న వ్యక్తి
మెరుపు వేగంతో టికెట్లు ప్రింట్ చేస్తూ.. నెటిజన్లను ఫిదా చేస్తున్న రైల్వే ఉద్యోగి
2500 మంది మహిళలతో ఎఫైర్.. 72 ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి
వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..