AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: మహిళలు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. ఈ చిన్నపాటి వ్యాపారం చేస్తే లక్షలు సంపాదించవచ్చు..!!

మహిళలు డబ్బు సంపాదించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఇంట్లో ఖాళీగా కూర్చుకోకుండా చిన్నపాటి వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చు. అలాంటి వ్యాపారాల్లో బ్యూటీపార్లర్ కూడా ఒకటి. బ్యూటీ పార్లర్ కోర్సు చేసి ఈ జాబ్ స్టార్ట్ చేస్తే ఎలాంటి నష్టం ఉండదు.

Business Idea: మహిళలు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. ఈ చిన్నపాటి వ్యాపారం చేస్తే లక్షలు సంపాదించవచ్చు..!!
Business Idea
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 22, 2023 | 6:08 PM

మహిళలు డబ్బు సంపాదించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఇంట్లో ఖాళీగా కూర్చుకోకుండా చిన్నపాటి వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చు. అలాంటి వ్యాపారాల్లో బ్యూటీపార్లర్ కూడా ఒకటి. బ్యూటీ పార్లర్ కోర్సు చేసి ఈ జాబ్ స్టార్ట్ చేస్తే ఎలాంటి నష్టం ఉండదు.

నేటికాలంలో మహిళలు అందానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అందుకే బ్యూటీపార్లర్‎లు నిత్యం రద్దీగా ఉంటాయి. అంతేకాదు మహిళలు ఇష్టపడే ప్రదేశాల్లో ఇవి ఒకటి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కోవిడ్ లాంటి సంక్షోభ సమయంలో కూడా బ్యూటీ పార్లర్‎లకు ఫుల్ డిమాండ్ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు..అందం మీద ఎంత ఆసక్తి ఉంటుదనేది. అయితే మీరు కూడా బ్యూటీ పార్లర్ తెరవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మీకోసమే.

బ్యూటీ పార్లర్‌ను ఎలా తెరవాలి? 

బ్యూటీ పార్లర్ తెరవడానికి ముందు, మీరు బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఒకేవేళ మీరు బ్యూటీషియన్ కోర్సు చేయనట్లయితే..ముందుగా పార్లర్ లేదా అకాడమీలో ట్రైనింగ్ తీసుకోండి. ఆ తర్వాతే మీరు పార్లర్ తెరవడం గురించి ఆలోచించండి. ఎందుకంటే శిక్షణ లేకుండా ఎలాంటి ఉద్యోగమైనా విజయం సాధించలేము.

ఇవి కూడా చదవండి

ఒకవేళ మీరు బ్యూటీషియన్ కోర్సు చేసినట్లయితే…మీరు ఇంట్లోనే పార్లర్ ను ప్రారంభించవచ్చు. ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ కోసం షాపు తెరవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కస్టమర్ ఇంటికి వెళ్లి సేవలను అందించండం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. కాబట్టి మీరు కస్టమర్ ఇంటికి వెళ్లి వారికి అవసరమైన సేవలను అందించే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే బ్యూటీ పార్లర్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరు నివసిస్తున్న ఇల్లు జనసాంద్రత ప్రాంతంలో ఉంటే..మీరు ఇంట్లోనే చిన్నగా ప్రారంభింవచ్చు. అవసరమైతే ఇంట్లోనే ఒక గదిలో దుకాణాన్ని కూడా తెరవచ్చు.

బ్యూటీ పార్లర్ల రిజిస్ట్రేషన్:

జీఎస్టీ లావాదేవీల కోసం బ్యాటీపార్లర్ లాభం పెరిగినట్లయితే మీరు జీఎస్టీకోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పార్లర్ చిన్నస్థాయి అయితే ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. పెద్దగా పెట్టినట్లయితే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మహిళలకు వారి అందాన్ని మెరుగుపరచుకోవడానికి ట్రైనింగ్ కూడా ఇవ్వవచ్చు. లేదంటే బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మి కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ప్రొఫెషనల్ కోర్సు చేయడం చేస్తే బ్యూటీ థెరపీ కూడా చేయోచ్చు. మెహందీ పెట్టడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు.

బ్యూటీ పార్లర్ ప్రారంభించడానికి అయ్యే ఖర్చు :

మీ ఇంట్లోనే ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కేవలం 10 నుంచి 15000వేల రూపాయాలతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. బ్యూటీ పార్లర్ కు అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసి..తర్వాత కావాల్సిన ఉత్పత్తులను పెంచుకోవాలి. ఒకవేళ పెద్దెత్తున పార్లర్ తెరవాలనుకుంటే 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది

బ్యూటీ పార్లర్ సామాగ్రిని ఎక్కడ కొనాలి? 

మీరు బ్యూటీ పార్లర్ తెరిచే ముందు దానికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడ పొందాలో తెలుసుకోండి. కొన్ని వస్తువులు చౌకగా దొరుకుతాయి. కానీ క్వాలిటీ సరిగ్గా ఉండదు. కాబట్టి మీరు క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి ఉత్పత్తులను ఉపయోగిస్తే…కస్టమర్లు మళ్లీ మళ్లీ మీ పార్లర్ కే వస్తుంటారు.

బ్యూటీ పార్లర్ వ్యాపారం నుండి లాభం:

లాభం అనేది మీరు పని చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. మీ పనితీరు కస్టమర్లకు నచ్చేలా ఉండాలి. మీరు మరింత ప్రచారం చేయాలి. మీరు దుకాణంతోపాటు కస్టమర్ల ఇళ్లకు వెళ్లి సేవలను అందించినట్లయితే మీరు మరింత సంపాదించవచ్చు. మీ పార్లర్ కు వచ్చిన కస్టమర్ తో స్నేహపూర్వకంగా మెదులుతూ…వారికి నచ్చిన విధంగా మీ సర్వీసులు ఉన్నట్లయితే …ఈ వ్యాపారంలో మీరు విజయం సాధిస్తారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం