Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇక తాగునీటిని వృథా చేస్తే భారీగా జరిమానా..!
Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నగర జలమండలి షాకిస్తోంది. మీరు తాగునీటిని వృథా చేస్తున్నారా? అయితే ఇక నుంచి అప్రమత్తంగా ఉండాల్సిందే. నిర్లక్ష్యంగా ఉంటూ తాగునీటిని వృథా చేసినట్లయితే భారీ జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తాజగా జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న..

Hyderabad: జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రజల నుండి వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చిన సమాచారం మేరకు, నివాస, వాణిజ్య ప్రాంగణాల్లో ఫ్లోర్లు, సెల్లార్లు, ఓపెన్ ఏరియాలను కడగడానికి తాగునీటిని వినియోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
మంగళవారం అధికారులకు వాట్సాప్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు, జూబ్లీహిల్స్‌లోని నివాసం ఉంటున్న దాసరి తనూజ రెడ్డి పేరుతో ఉన్న (CAN No. 061108578) ఇంటివద్ద ఫ్లోర్ ను కడుతూ నీటిని దుర్వినియోగం చేసినట్లు స్థానిక అధికారులు గుర్తించారు.
దీంతో జలమండలి నిబంధనలు ఉల్లంఘించినందుకు వారికి రూ.5000 ఫైన్ వేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. జలమండలికి తాగునీటి వృథాపై ఫిర్యాదులు అందుతున్నాయి. కస్టమర్ కేర్ కు ఫోన్ చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో నేరుగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు నగర వాసులకు వార్నింగ్ ఇచ్చారు. నీటిని వృథా చేసినట్లయితే భారీ ఫైన్ చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ATM Rules: కొత్త రూల్స్ గురూ..! UPI ద్వారా నగదు విత్‌డ్రా చేస్తున్నారా? ఇక బాదుడే.. బాదుడు
దీంతో జీఎంలు తమ పరిధిలో.. తాగునీరు సరఫరా చేసే సమయంలో తమ సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేయిస్తున్నారు. ఎవరైనా తాగునీరు వృథా చేసినట్లు గమనిస్తే.. వెంటనే నోటీసులు జారీ చేసి జరిమానా విధిస్తున్నారు. తాగునీటి దుర్వినియోగంపై ఫిర్యాదులు చేయాలనుకునే వారు వాట్సాప్ నంబర్ +91 99499 30003 లేదా మెట్రో కస్టమర్ కేర్ 155313 ద్వారా సమాచారం అందించవచ్చు.
ఇది కూడా చదవండి: Working Days: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారానికి 4 రోజులే పని దినాలు.. ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




