Rithu Chowdary: ఒక అమ్మాయిని మరో అమ్మాయే మోసం చేస్తుంది.. రీతూ చౌదరి షాకింగ్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ ఫేమ్, జబర్దస్త్ నటి రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఒకటి హాట్ టాపిక్ గా మారింది. అందులో ఆమె 'అమ్మాయిల జీవితాలు ఇంతేనా? ఆమె బాధలు ఎవరికీ పట్టవా' అని రాసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. అంతుకు ముందు పలు సీరియల్స్, టీవీ షోస్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ గతేడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మెరిసింది. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అన్నిటికీ మించి డీమాన్ పవన్ తో లవ్ ట్రాక్ నడిపి బాగా హైలెట్ అయ్యింది. ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటోన్న రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అమ్మాయిల జీవితం ఇంతేనా అంటూ ఇన్ స్టా స్టోరీస్ ఒక పోస్ట్ షేర్ చేయడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘ఈ సమాజం అమ్మాయిల క్యారెక్టర్ ను సులభంగా జడ్జ్ చేస్తారు. ఆమెకు గతంలో ఏం జరిగిందో ఎవరూ అడగరు. తన ప్రేమ, కేరింగ్, నిజాయతీ గురించి ఎవరికీ అక్కర్లేదు. కానీ చివరకు మోసపోయేది ఒక అమ్మాయే. రిలేషన్ షిప్ బ్రేకప్స్, డిప్రెషన్‌లో ఉన్నా తన ఫ్యామిలీ కోసం, కెరీర్ కోసం అందరి ముందు నవ్వుతూ ఉంటుుంది. కానీ సమాజం మాత్రం తన బాధను, ఆవేదనను చూడదు. అందరూ రూమర్స్, ఆరోపణలే చూస్తారు. నిజం ఏంటో తెలియకుండా అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ తను అమాయకురాలు అయితే ఎందుకు సైలెంట్‌గా ఉంది అంటారు’
‘ఒక అమ్మాయి హార్ట్ బ్రేకప్ చేసి ఆ అబ్బాయి ముందుకు వెళ్లిపోతాడు. అతను చాలా ఈజీగా మరో అమ్మాయితో వెళ్లిపోతాడు. కానీ అమ్మాయి మాత్రం అలా కాదు. అన్ని తెలిసినా కూడా సైలెంట్‌గానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్ షిప్ కూడా బలమైన ఆయుధంగా మారింది. ఒక అమ్మాయి డబ్బు కోసం, చీప్ అటెన్షన్ కోసం మరో అమ్మాయిపై ఆరోపణలు చేస్తుంది. సమాజం ముందు బ్యాడ్ చేస్తుంది. ఒక అమ్మాయి మరో అమ్మాయిని నాశనం చేస్తుందని తెలిసినా కూడా ఆ అమ్మాయి సైలెంట్‌గానే ఉంటుంది. అది ఆమె బలహీనత కాదు.. అదంతా తన కర్మ అని నమ్ముతుంది. తన గురించి నిజాలు తెలియని ఈ సమాజం జడ్జ్ చేస్తున్నా కూడా సైలెంట్ గా ఆ బాధని భరిస్తుంది’ అంటూ తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది.
ప్రస్తుతం రీతూ చౌదరి షేర్ చేసిన ఈ లాంగ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు రీతూకు ఏమయ్యింది? ఈ స్టోరీ తనదేనా లేదంటే తన ఫ్రెండ్ గురించేనా? అంటూ ఆరా తీస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




