RGV : హైదరాబాద్ మేయర్ ఇంట్లోకి 5000 కుక్కలను తోలాలి.. మరోసారి సంచలన కామెంట్స్ చేసిన ఆర్జీవీ

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు చేశారు. ఆమె తన కుక్కకు కుడి చేత్తో ఫుడ్‌ తినిపిస్తూ.. ఎడమ చేత్తో తాను తింటున్న వీడియోను ఉద్దేశించి

RGV : హైదరాబాద్ మేయర్ ఇంట్లోకి 5000 కుక్కలను తోలాలి.. మరోసారి సంచలన కామెంట్స్ చేసిన ఆర్జీవీ
Rgv
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 24, 2023 | 7:32 AM

హైదరాబాద్ లో వీడి కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. దీని పై సర్వత్రా చర్చ నడుస్తోంది. కుక్కల దాడి పై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు చేశారు. ఆమె తన కుక్కకు కుడి చేత్తో ఫుడ్‌ తినిపిస్తూ.. ఎడమ చేత్తో తాను తింటున్న వీడియోను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి.కుక్కలపై మేయర్ గారి ప్రేమ చాలా ఉన్నతంగా ఉంది. కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకెళ్లి ఫుడ్‌ తినిపిస్తే.. అవి మా పిల్లల్ని తినవు అంటూ ట్వీట్‌ చేశారు.

కుక్కలపై ఇంత ప్రేమ చూపిస్తున్న మేయర్‌ ..నగరంలో ఉన్న 5 లక్షల కుక్కలను ఇంటికి తీసుకెళ్లి మధ్యలో కూర్చుంటే బాగుంటుందని కామెంట్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మరోసారి ఇదే విషయం పై స్పందించారు ఆర్జీవీ.

ఈ సారి ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆర్జీవి మాట్లాడుతూ.. కేటీఆర్ గారు గద్వాల్ విజయలక్ష్మీ  ఇంట్లో 5000 వీది కుక్కలను విడిచిపెట్టాలని అన్నారు. విడిచిపెడితే ఆమె వాటి పై ఎంత ప్రేమను చూపిస్తారో చూడాలి అని అన్నారు. ఇక వీడియో చివరిలో నాకు మహిళలంటే చాలా గౌరవం కానీ మీమీద లేదు అని ఆర్జీవీ అన్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.