Sridevi Death Anniversary: సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన సిరిమల్లెపూవు.. నేడు శ్రీదేవి వర్ధంతి
దక్షిణాదితోపాటు ఉత్తరాదిని ఊపేసిన శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఆమె చేయని పాత్ర లేదు.
అతిలోకసుందరి శ్రీదేవి గురించి తెలియని వారు ఉండరు. ఆమె అందంలోనూ నటనలోనూ తనకు తనే సాటి అనిపించుకున్నారు శ్రీదేవి. నేడు ఆ అందాల తార నేలరాలిన రోజు. సరిగ్గా నేటికీ శ్రీదేవి చనిపోయి ఐదేళ్లు అవుతోంది. దక్షిణాదితోపాటు ఉత్తరాదిని ఊపేసిన శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఆమె చేయని పాత్ర లేదు. ఆమె చేయని డ్యాన్స్‌లేదు. ఆమె పలికించని హావబావాలు లేవు. ఎన్నో పాత్రల్లో.. ఎన్నో రకాలుగా జీవించిన ఈ వసంత కోకిల.. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
1980-90 దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది శ్రీదేవి. నిర్మాత బోనీకపూర్‌తో పెళ్లయ్యాక 1997లో నటనకు కాస్త విరామం చెప్పారు. ఆ తర్వాత 2012లో ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రంతో మళ్లీ సిల్వర్ స్ర్కీన్‌పై దర్శనమిచ్చింది. ఆమె తిరిగి సినిమాల్లో నటిస్తుండటంతో అభిమానులంతా సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.
శ్రీదేవి.. 2018 ఫిబ్రవరి 24న.. ఈ లోకాన్ని వీడిన విషయం తెలిసిందే. ఆమె అకాల మరణ వార్త విన్న ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. తన రిలేటివ్స్ మ్యారేజ్ కోసం దుబాయ్ వెళ్లిన ఆమె.. ఓ హోటల్ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసారు. అయితే అప్పట్లో ఆమె మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి.