Kiran Abbavaram: ఓటీటీలోకి కుర్రహీరో హిట్ మూవీ.. వినరో భాగ్యము విష్ణుకథ వచ్చేది అప్పుడేనా..?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.
హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కుర్రహీరో కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా ఈ యంగ్ హీరో వినరో భాగ్యము విష్ణుకథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో కశ్మీర హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు అక్కినేని యంగ్ హీరో అఖిల్ హాజరైన విషయం తెలిసిందే..
ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తోంది. వినరో భాగ్యము విష్ణుకథ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది.
థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. వినరో భాగ్యము విష్ణుకథ సక్సెస్ తో కిరణ్ అబ్బవరం స్పీడ్ పెంచాడు వరుస సినిమాలను లైనప్ చేసి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు ఈ కుర్రహీరో.