AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dochevarevarura Trailer: “దోచేవారెవరురా” ట్రైలర్ విడుదల చేసిన హరీష్ శంకర్..

ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, దర్శక ధీరుడు రాజమౌళి  విడుదల చేసిన టీజర్ కు, దర్శకులు సుకుమార్, అనిల్ రావి పూడి, విజయేంద్ర ప్రసాద్ లు విడుదల చేసిన పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

Dochevarevarura Trailer: దోచేవారెవరురా ట్రైలర్ విడుదల చేసిన హరీష్ శంకర్..
Dochevarevarura Movie
Rajitha Chanti
|

Updated on: Feb 27, 2023 | 8:38 AM

Share

IQ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణవచంద్ర ..మాళవిక సతీషన్ అజయ్ గోష్. బిత్తిరి సత్తి ..మాస్టర్ చక్రి. జెమిని సురేష్. నటీ నటులుగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు దర్శకత్వంలో బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం “దోచేవారెవరురా”. నఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు ..తనికెళ్ళ భరణి,. బెనర్జీ అతిధి పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, దర్శక ధీరుడు రాజమౌళి  విడుదల చేసిన టీజర్ కు, దర్శకులు సుకుమార్, అనిల్ రావి పూడి, విజయేంద్ర ప్రసాద్ లు విడుదల చేసిన పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11. న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా.. నటులు ఉత్తేజ్, హర్ష వర్ధన్, దర్శకులు ప్రణీత్ లు చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెష్ తెలియజేశారు.

దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ప్రతి హీరో లో ఒక డైరెక్టర్ ఉంటాడు. ప్రతి డైరెక్టర్ లో ఒక హీరో ఉంటాడు. అయితే వీరిలోని వారు , వారి లోని వీరు బయటకు రాకూడదు అని ఒక సందర్భంలో చెప్పారు. అలాగే చాలా మంది సినిమాను సెలెక్ట్ చేసుకున్నాం అంటారు. కానీ సినిమా మీద ప్యాషన్ ఉన్నవాడిని సినిమానే మనల్ని సెలెక్ట్ చేసుకుంటుంది తప్ప సినిమాను మనం సెలెక్ట్ చేసుకోము .శివ నాగేశ్వరావు గారు చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి తనకున్న సెన్సాఫ్ హ్యూమర్ మాకు కూడా లేదు. తను ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాడు.మళ్ళీ ఇప్పుడు మంచి కథతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇందులో నటించిన నటులకు, టెక్నిషియన్స్ కు, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఇవి కూడా చదవండి

చిత్ర దర్శకుడు శివ నాగేశ్వరావు మాట్లాడుతూ.. మా ట్రైలర్ ను విడుదల చేయడానికి వచ్చిన హరీష్ శంకర్, ఉత్తేజ్, దర్శకులు ప్రణీత్, నటుడు హర్ష వర్ధన్ లకు థాంక్స్. షూట్ లో ఊన్న రవితేజ సినిమా చంచల్ గూడ జైల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తనను కలవడానికి వెళ్లే వాన్ని, అక్కడ దర్శకుడు హరీష్ చేస్తున్న ఒక షార్ట్ బై షార్ట్ ను అబ్జర్వ్ చేసి నువ్వు ఫ్యూచర్ లో గొప్ప డైరెక్టర్ అవుతావు అన్నాను. ఇప్పుడు తనే నా సినిమాకు గెస్ట్ గా వచ్చాడు.ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ మొత్తం డబ్బుకు సంబందించిన అంశం చుట్టూ జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఇంటినుండి బయటికి వచ్చిన తరువాత మనల్ని రకరకాలుగా దోచుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవర్ని దోచుకోవాలో సెలెక్ట్ చేసుకొని వారిని దోచుకొనే వారు. ప్రస్తుతం మనల్ని ఎవరు దోచుకోవాలో వారిని మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఒక్క ఓటు వేసి.అయితే ఇది పొలిటికల్ సినిమా కాదు ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ తో పాటు ఫుల్ ఔట్ & ఔట్ కామెడీ థ్రిల్లర్ కూడా ఉంటుంది.ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సామెతంగా కూర్చొని చూడదగ్గ సినిమాగా తెరకెక్కించడం జరిగింది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు.