AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యను హతమార్చి.. మృతదేహాన్ని నీళ్ల ట్యాంకులో దాచిన కిరాతకుడు

కర్నాటక  రాష్ట్రంలో అమానుష ఘటన వెలుగులోకొచ్చింది. భార్యను హతమార్చి శవాన్ని ఖాళీ వాటర్‌ ట్యాంకులో దాచాడో దుర్మార్గుడు. ఉత్తర కన్నడ జిల్లా హలియాల్ సమీపంలోని..

భార్యను హతమార్చి.. మృతదేహాన్ని నీళ్ల ట్యాంకులో దాచిన కిరాతకుడు
Karnataka Crime News
Srilakshmi C
|

Updated on: Feb 27, 2023 | 8:33 AM

Share

కర్నాటక  రాష్ట్రంలో అమానుష ఘటన వెలుగులోకొచ్చింది. భార్యను హతమార్చి శవాన్ని ఖాళీ వాటర్‌ ట్యాంకులో దాచాడో దుర్మార్గుడు. ఉత్తర కన్నడ జిల్లా హలియాల్ సమీపంలోని టెర్గావ్ గ్రామంలో ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెర్గావ్ గ్రామంలో కాపురం ఉంటోన్న తుకారాం మడివాల్ (38), అతని భార్య శాంతకుమారి (33) దంపతులు. తుకారాం పరాయి మహిళలతో సన్నిహితంగా మెలగడంపై భార్య శాంతకుమారి ప్రశ్నించింది. ఈ విషయమై భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన తుకారం భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఖాళీ నీళ్ల ట్యాంకులో రెండు రోజులుగా భద్రపరిచాడు. అనంతరం ఖానాపురకు చెందిన రిజ్వాన్‌కుంబారి అనే వ్యక్తికి చెందిన టాటాఏస్‌ వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. మూడో కంటికి తెలియకుండా భార్య మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పారవేశాడు.

ఈ క్రమంలో శనివారం నాడు తాము నివాసం ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేస్తున్నామని ఇంటి యజమానికి చెప్పాడు. గోవా వెళుతున్నానని యజమానితో చెప్పాడు. ఐతే తుకారంతో అతని భార్య లేకపోవడాన్ని గమనించిన ఇంటి యజమానికి అనుమానం కలిగింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. హుళియాళ, రామనగర పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేసి నిందితుడిని అరెస్టు చేసారు. అనంతరం తమదైన శైలిలో ప్రశ్నించగా భార్యను హత్య చేసి మృతదేహాన్ని అడవిలో పారేసినట్లు నేరాన్ని అంగీకరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.