AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Oil Prices: సామాన్యుడికి షాక్‌.. మళ్లీ పెరిగిన వంట నూనెల ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

కేవలం నెల రోజుల వ్యవధిలోనే వేరుసెనగ నూనె ధర లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగింది. ఫిబ్రవరి 26నాటికి వేరుశనగ నూనె లీటరుకు రూ.180లకు చేరుకుంది. పామాయిల్‌ ధర లీటరుకు..

Cooking Oil Prices: సామాన్యుడికి షాక్‌.. మళ్లీ పెరిగిన వంట నూనెల ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Cooking Oil Prices
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 27, 2023 | 12:04 PM

కేవలం నెల రోజుల వ్యవధిలోనే వేరుసెనగ నూనె ధర లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగింది. ఫిబ్రవరి 26నాటికి వేరుశనగ నూనె లీటరుకు రూ.180లకు చేరుకుంది. పామాయిల్‌ ధర లీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకు ఎగబాకి ప్రస్తుతం రూ.104లకు చేరుకుంది. ఇక పొద్దు తిరుగుడు నూనె లీటరుకు రూ.135ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దేశీయంగా నూనె గింజల పంటల ఉత్పత్తి తగ్గడం, విదేశాల్లో వేరుసెనగ నూనెకు అధిక డిమాండ్‌ పెరగడం.. వంటి కారణాల వల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తర్వాత నుంచి చైనా మన దేశం నుంచి వేరుసెనగ దిగుమతుల్ని పెంచింది. పైగా ఆ దేశంలో వేరుసెనగ నూనెకు డిమాండు ఎక్కువ పలుకుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 104 లక్షల టన్నుల వేరుసెనగ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. 100 లక్షల టన్నులే వస్తుందని ఈ నెల 14న విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో వెల్లడైంది. దేశంలో 9 రకాల నూనెగింజల పంటలు కలిపి 423 లక్షల టన్నులను లక్ష్యంగా నిర్ణయించగా, రెండో ముందస్తు అంచనాల ప్రకారం 400 లక్షల టన్నుల మేర వస్తుందని గుర్తించారు.

దేశంలో వేరుసెనగ సాగు, ఉత్పత్తిలో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. మొత్తం ఉత్పత్తిలో 45 శాతం పంట ఆ రాష్ట్రంలోనే పండిస్తున్నారు. తర్వాత రాజస్థాన్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. గుజరాత్‌లోని గోండల్‌ ప్రాంతంలో వందకు పైగా నూనెతయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆయిల్‌ఫెడ్‌ కూడా అక్కడి నుంచే నూనెను దిగుమతి చేసుకుని విజయ బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తోంది. ఐతే ఈ ఏడాది గుజరాత్‌లో వేరుశనగ పంట ఉత్పత్తి తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్వింటాళ్‌కు రూ.7,400 నుంచి రూ.8,400 వర ధర పలుకుతోంది. పొద్దుతిరుగుడు నూనె లీటరు ధర రూ.135 వద్ద ఉంది. దిగుమతులు తగ్గిపోవడం, ఎగుమతులపై ఇండోనేసియా ఆంక్షలు విధించడం కారణంగా దేశీయంగా వంట నూనెల ధరలు పెరుతుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
ఇండియాలో 107 మంది పాకిస్తాన్‌ పౌరులు మిస్సింగ్‌!
ఇండియాలో 107 మంది పాకిస్తాన్‌ పౌరులు మిస్సింగ్‌!
తెల్ల నేరేడు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!
తెల్ల నేరేడు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!
ఫ్రిజ్‌లో రోజుల తరగడి బాటిల్‌ నీళ్లు నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?
ఫ్రిజ్‌లో రోజుల తరగడి బాటిల్‌ నీళ్లు నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?
అందరూ ఇష్టంగా లాగించేస్తారు..? కానీ.. ఇవి విషంతో బరాబర్‌ అంట..
అందరూ ఇష్టంగా లాగించేస్తారు..? కానీ.. ఇవి విషంతో బరాబర్‌ అంట..
బ్యాటర్ వికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా, వద్దంటోన్న చెత్త బౌలర్
బ్యాటర్ వికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా, వద్దంటోన్న చెత్త బౌలర్