Business Ideas: ఈ వ్యాపారానికి ఎల్లప్పుడూ డిమాండ్… జీరో ఇన్వెస్ట్మెంట్ తో లక్షలు సంపాదించవచ్చు.!!
ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? వ్యాపారం పెట్టేంత పెట్టుబడి లేదా? చింతించాల్సిన అవసరం లేదు. ఎలాంటి పెట్టుబడి లేకుండానే పూల వ్యాపారం ప్రారంభించండి.
ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? వ్యాపారం పెట్టేంత పెట్టుబడి లేదా? చింతించాల్సిన అవసరం లేదు. ఎలాంటి పెట్టుబడి లేకుండానే పూల వ్యాపారం ప్రారంభించండి. ఎందుకంటే పూల వ్యాపారం చాలా లాభదాయకం ఉంటుంది. ఈ వ్యాపారానికి ఒక సీజన్ అంటూ ఏమీ ఉండదు. మన భారతదేశంలో ప్రతిరోజూ పూలను ఏదొక సందర్భంలో ఉపయోగిస్తూనే ఉంటారు. శుభకార్యాలు, పండగలు, మరణించినవారికి కూడా , ఊరేగింపులు, దహనసంస్కారాలు ఇలా ఎన్నో కార్యక్రమాలకు పూలను ఉపయోగిస్తారు. కాబట్టి మీ జీవితం కూడా సాఫీగా జరగాలంటే పూల వ్యాపారం ప్రారంభించండి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసి సంపాదించాల్సిన అసవరం లేదు. బుర్రకు కాస్తా పదును పెడితే చాలు..వ్యాపార రంగాల్లో కూడా కోట్లను సంపాదించవచ్చు. అయితే ఇవాళ పూల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.
మనం ముందుగానే చెప్పుకున్నట్లు పూలకు గిరాకీ లేని రోజంటూ ఏదీ లేదు. దీపావళి పండగ నుంచి వివాహవేడుకల వరకు, ఆలయ అలంకరణ నుంచి..గణేష్ చతుర్థి వరకు పూలు ఉండాల్సిందే. పండలు, పెళ్లిళ్ల సీజనల్లో పూల మార్కెట్ భారీగా డిమాండ్ ఉంటుంది. మీరు కూడా పూల వ్యాపారం చేయాలనుకుంటే భారీగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి కొంతమంది భయపడుతుంటారు. ఎందుకంటే పువ్వులు తొందరగా వాడిపోతాయి. వృధా అయితే వ్యాపారంలో నష్టం వస్తుంది. అయితే దీనికి మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పూల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే పువ్వులు తాజాగా ఉండేలా చూసుకోవాలి. మీకు పువ్వులను నిల్వ చేయడానికి ఎక్కువగా స్థలం లేనట్లయితే…వాటిని తాజాగా ఉంచలేకపోత…మీరు తక్కువగా కొనుగోలు చేసి విక్రయించండి.
పూల వ్యాపారం కోసం స్థలం ఎంపిక:
పువ్వుల వ్యాపారం చేయాలనుకుంటే ముందుగా స్థలాన్ని ఎంచుకోవాలి. మీరు ఇంట్లో నుంచి ఈ వ్యాపారం చేస్తే పరిమితంగా ఉంటుంది. రద్దీగా ఉండే ప్రదేశంలో మార్కెట్ ప్రదేశంలో వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలుఉంటాయి. మీ ఇల్లు వీధిలో ఉంటే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మతపరమైన ప్రదేశాల్లో కూడా పువ్వులషాపును తెరవచ్చు.
పూల వ్యాపారం కోసం ఉద్యోగి :
మీరు రిటైల్ పూలను విక్రయించాలనుకుంటే, దీని కోసం ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ కుటుంబ సభ్యుల సహాయంతోకూడా ఈ వ్యాపారాన్ని చేయవచ్చు. కానీ మీరు అదే పుష్పగుచ్ఛాన్ని,పూల దండలు అల్లడం వంటివి విక్రయించాలనుకుంటే మీరు దాని కోసం ట్రైనింగ్ తీసుకోవాలి.
పూల వ్యాపారం ఖర్చు :
పూల వ్యాపారానికి 5 నుంచి 10 వేల చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మీ వ్యాపారం పూల సేకరణ, అద్దె భవనం మొదలైనవి వంటి విస్తరిస్తే, దానికి అనుగుణంగా ఖర్చు చేయాలి. పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించాలంటే రూ. 2 నుంచి రూ. 3లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
పూల వ్యాపారంలో లాభం :
ముందే చెప్పినట్లుగా పూల వ్యాపారంలో లాభం ఉంటుంది. పువ్వుల కోసం డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి, మీరు లాభాన్ని అంచనా వేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..